The Paradise: నాని ‘ది పారడైజ్'పై అలాంటి రూమర్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మూవీ మేకర్స్!

హ్యాట్రిక్ విజయాలతో ఫుల్ ఫామ్‌లో దూసుకెళ్తున్న నేచురల్ స్టార్ నాని (Nani) ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా 'ది పారడైజ్' (The Paradise)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'దసరా' వంటి రా అండ్ రస్టిక్ బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) మరోసారి నానితో చేతులు కలపడంతో ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ సోషల్ మీడియాలో పెను సంచలనం సృష్టించాయి. నాని ఇంతకుముందెన్నడూ కనిపించని వైలెంట్, ఇంటెన్స్ అవతార్‌లో కనిపించడంతో అభిమానులు ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో ఎదురు చూస్తున్నారు.

అయితే గత కొన్ని రోజులుగా 'ది పారడైజ్' గురించి సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. సినిమా అవుట్‌పుట్ అనుకున్న స్థాయిలో రాలేదని, భారీగా రీషూట్స్ జరుగుతున్నాయని, షూటింగ్ ఆలస్యం అవుతోందని, మేకర్స్ టెన్షన్‌లో ఉన్నారంటూ పలు యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా పేజీలు ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. ఈ ప్రచారం రోజురోజుకూ పెరుగుతుండటంతో చివరికి మూవీ టీమ్ అధికారికంగా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Nani s The Paradise Team Breaks Silence on Reshoots Rumours Confirms August 2026 Release

తాజాగా 'టీమ్ ది పారడైజ్' పేరుతో విడుదల చేసిన అధికారిక ప్రకటనలో మేకర్స్ అన్ని రూమర్స్‌ను పూర్తిగా ఖండించారు. "గత కొన్ని రోజులుగా మా సినిమా గురించి ఎలాంటి ఆధారాలు లేకుండా బాధ్యతారహితమైన ప్రచారం జరుగుతోంది. అందుకే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం వచ్చింది" అంటూ స్టేట్‌మెంట్ ప్రారంభించారు. "ఈ ప్రాజెక్ట్‌ను మొదటి రోజు ఎంత క్లారిటీతో ప్లాన్ చేశామో.. ఇప్పటికీ అదే ప్రణాళిక ప్రకారం షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే 100కి పైగా షూటింగ్ డేస్ విజయవంతంగా పూర్తయ్యాయి. మిగిలిన షెడ్యూల్ కూడా ఎలాంటి ఆలస్యం లేకుండా ప్లాన్ ప్రకారమే కొనసాగుతోంది" అని పేర్కొన్నారు.

ఇక సినిమా రీషూట్స్ వ్యవహారంపై కూడా మూవీ టీమ్ గట్టిగానే స్పందించింది. "ఇప్పటివరకు ఈ సినిమాకు ఒక్క సీన్ కూడా రీషూట్ చేయలేదు. భవిష్యత్తులో కూడా రీషూట్స్ చేసే ఆలోచనే లేదు" అంటూ స్పష్టం చేసింది. సాధారణంగా భారీ సినిమాల విషయంలో రీషూట్స్ కామన్ అయినా.. 'ది పారడైజ్' విషయంలో అలాంటిదేమీ లేదని మేకర్స్ తేల్చి చెప్పారు. "మా సినిమా గురించి కావాలని అసత్య ప్రచారం చేస్తే ఇకపై నేరుగా స్పందిస్తాం. అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి వచ్చే అప్‌డేట్స్ మాత్రమే నమ్మండి" అంటూ ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేసింది. దీంతో ఇకపై ఈ సినిమాపై వచ్చే రూమర్స్‌పై మూవీ టీమ్ మరింత సీరియస్‌గా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది.

ఇప్పటికే 'ది పారడైజ్'పై ఇండస్ట్రీలో భారీ హైప్ ఉంది. నాని కెరీర్‌లోనే ఇది అత్యంత డార్క్, వైలెంట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోందని సమాచారం. శ్రీకాంత్ ఓదెల తన మార్క్ రస్టిక్ ట్రీట్‌మెంట్‌తో పాటు, అంతర్జాతీయ స్థాయి విజువల్ స్టైల్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా గ్లింప్స్‌లో కనిపించిన విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, నాని బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి పెంచాయి. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటం మరో పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. ఇప్పటికే గ్లింప్స్‌లో వినిపించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నాని-అనిరుధ్ కాంబోపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరోవైపు నాని ప్రస్తుతం వరుస విజయాలతో కెరీర్‌లో పీక్ ఫేజ్‌లో ఉన్నాడు. 'దసరా', 'హాయ్ నాన్న', 'సరిపోదా శనివారం' వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న నాని.. ఇప్పుడు 'ది పారడైజ్'తో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. అందుకే ఈ సినిమా విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మేకర్స్ భారీ స్థాయిలో నిర్మాణ విలువలను చూపిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక రిలీజ్ డేట్ విషయానికొస్తే.. 'ది పారడైజ్'ను 2026 ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు టీమ్ మరోసారి కన్ఫర్మ్ చేసింది. దీంతో నాని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Read more about: srikanth odela nani The Paradise
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X