twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘టక్ జగదీష్’ రిలీజ్ డేట్ ఫిక్స్: దాని మీదే ఫోకస్ చేస్తున్న నాని అండ్ టీమ్

    |

    నేచురల్ స్టార్ నాని హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రం 'టక్ జగదీష్'. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా విడుదలకు కరోనా రూపంలో అడ్డంకి ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో దీని విడుదల అనుకున్న సమయానికి కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రం ఓటీటీలో నేరుగా రిలీజ్ అవుతుందని ఆ మధ్య ప్రచారం జరిగినా.. చిత్ర యూనిట్ మాత్రం దాన్ని ఖండించింది. ఎప్పటికైనా థియేటర్లలోనే విడుదల చేస్తామని వెల్లడించింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ గురించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.

    'నిన్ను కోరి' వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత నాని.. శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న 'టక్ జగదీష్'పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకే దీన్ని థియేటర్లలోనే విడుదల చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గడంతో ఒక్కో మూవీ యూనిట్ రిలీజ్ డేట్‌పై ఫోకస్ చేస్తోంది. ఈ క్రమంలోనే 'టక్ జగదీష్' సినిమాను ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని డిసైడ్ అయినట్లు తాజాగా తెలిసింది. ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ చిత్రాన్ని రెండు రోజుల ముందే విడుదల చేస్తారట. దీనికి సంబంధించిన ప్రకటన అతి త్వరలో రానుందని తెలుస్తోంది.

    Nanis Tuck Jagadish Release on August 13th

    ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'టక్ జగదీష్' నుంచి ఇప్పటి వరకూ విడుదలైన అన్ని పోస్టర్లు, పాటలు, టీజర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా దీనిపై అంచనాలు కూడా అదే రీతిలో పెరిగిపోయాయి. ఇక, ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని సరసన టాలెంటెడ్ హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ నటిస్తున్నారు. ఈ సినిమాను షైస్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, పెద్ది హరీష్ నిర్మిస్తున్నారు. నరేష్, జగపతిబాబు, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు.

    English summary
    Natural Star Nani, Ritu Varma and Aishwarya Rajesh Doing Tuck Jagadish Movie Under Shiva Nirvana Direction. This Movie will be Release on August 13th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X