twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనుకున్న డేట్‌ కంటే ముందే ‘టక్ జగదీష్’: త్వరలోనే అధికారిక ప్రకటన

    |

    నేచురల్ స్టార్ నాని ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో సత్తా చాటుతున్నాడు. ఒకటి షూటింగ్ జరుగుతుండగానే మరికొన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల అతడు నటించిన చిత్రం 'టక్ జగదీష్'. ప్రేమకథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కించాడు. దీని షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. కానీ, అనివార్య కారణాల వల్ల ఇది విడుదల కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనిపై ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.

    'నిన్ను కోరి' వంటి విజయవంతమైన సినిమా తర్వాత నాని - శివ నిర్వాణ కలయికలో తెరకెక్కించిన చిత్రమే 'టక్ జగదీష్'. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఎప్పుడో విడుదలకు సిద్ధం అయింది. అయితే, కరోనా సెకెండ్ వేవ్ కారణంగా దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేకపోయారు. అయితే, ఇప్పుడు పరిస్థితులు చక్కబడడంతో ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయాలని భావించారు. తాజా సమాచారం ప్రకారం.. అనుకున్న సమయానికి కంటే ముందే అంటే జూలై 30నే 'టక్ జగదీష్'ను రిలీజ్ చేయబోతున్నారట. దీనికి సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే రాబోతుందని తెలుస్తోంది.

    Nanis Tuck Jagadish Release on July 30th

    నానిని మాస్ హీరోగా పరిచయం చేస్తూ శివ నిర్వాణ తెరకెక్కించిన 'టక్ జగదీష్'పై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి విడుదలైన ప్రతి పోస్టర్, పాట, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ప్రీ బిజినెస్ కూడా భారీగా జరిగింది. ఇక, ఈ సినిమాలో టాలెంటెడ్ హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ నటిస్తున్నారు. ఈ సినిమాను షైస్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, పెద్ది హరీష్ నిర్మిస్తున్నారు. నరేష్, జగపతిబాబు, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు.

    English summary
    Natural Star Nani, Ritu Varma and Aishwarya Rajesh Doing Tuck Jagadish Movie Under Shiva Nirvana Direction. This Movie will be Release on July 30th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X