నాన్న సినిమాలో నటించిన పాప ఇప్పుడెలా ఉందో తెలుసా?.. 17 ఏళ్ళ వయసులోనే ఘాటుగా చూపిస్తూ..

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన వారు ఇప్పుడు మాత్రం గ్లామర్ తో ఆశ్చర్యం కలిగిస్తున్నారు. ఒకప్పుడు బేబీ రోల్స్ చేసిన వారు కూడా ఇప్పుడు మరీ ఘాటుగా దర్శనమిస్తున్నారు. ఇక నాన్న సినిమాలో నటించిన క్యూట్ గర్ల్ సారా కూడా ఇప్పుడు మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తోంది. ఇక ఆమెకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక లేటెస్ట్ గా పోస్ట్ చేసిన ఒక ఫొటో వివరాల్లోకి వెళితే..

నాన్న సినిమాలో వెన్నెల పాత్ర: సారా అర్జున్.. ఈ పేరు చెబితే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ.. చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో ఏఎల్ విజయ్ డైరెక్షన్ వచ్చిన నాన్న సినిమాలో పాప అనగానే చాలా మందికి గుర్తొస్తుంది. తన పేరే సారా అర్జున్. ఈ మూవీలో వెన్నెల అనే పాత్రలో తన నటనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అదే తన మొదటి సినిమా అన్న విషయం చాలా మందికి తెలియదు.

 Sara arjun

వీరిద్దరి మధ్య బాండింగ్ : సినిమాలో మానసిక వికలాంగుడి పాత్రలో నటించాడు చియాన్ విక్రమ్. బేబీ సారా తన కూతురి పాత్రలో జీవించేసింది. వీరిద్దరి మధ్య బాండింగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ లో వీరిద్దరి నటన సినిమా మొత్తానికి హైలెట్. అలా సినీ ప్రేక్షకులను కంటతడి పెట్టించింది సారా.

 Sara arjun

పాన్నియిన్ సెల్వన్ పాత్రలో : 2011లో విడుదలై మంచి హిట్ అందుకుంది నాన్న మూవీ. అప్పటికి బేబీ సారా వయస్సు కేవలం ఐదేళ్లు మాత్రమే. ఆ తర్వాత చాలానే సినిమాల్లో కనిపించింది సారా. రీసెంట్ గా వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఐశ్వర్య రాయ్ పోషించిన నందిని క్యారెక్టర్ చిన్ననాటి పాత్రలో సారా నటించింది. అయితే ఇప్పుడు తనను చూస్తే ఆశ్చర్యపోతారు.

 Sara arjun

చేతిలో సిగరెట్.. షాకింగ్ లుక్ : తాజాగా సోషల్ మీడియాలో సారా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన నెటిజన్లు షాక్ కు గురవుతున్నారు. ఒకప్పుడు నాన్న సినిమాలో చూసిన పాపనేనా ఇప్పుడు ఇలా తయారైందని అనుకుంటున్నారు. అంతలా తన గెశ్చర్ మార్చేసింది సారా. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్స్ లో సారా చేతిలో సిగరెట్ తో కనిపించింది. మాస్ లుక్ లో కనిపించి ఆశ్చర్యానికి గురిచేసింది.

 Sara arjun

మరో సినిమాతో బిజీగా..: అయితే ఈ పిక్స్ తమిళ మూవీ కొటేషన్ గ్యాంగ్ లోనిది. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఇందులో ప్రతీకారం కోసం పోరాడే అమ్మాయి పాత్రలో కనిపించనుంది సారా అర్జున్. ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, సన్నీ లియోన్, ప్రియమణి లాంటి వారు నటిస్తున్నారు. ఈ సినిమాకు వివేక్ కె కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X