ఆ విషాదంపై స్పందించని ఎన్టీఆర్ .. మళ్ళీ క్యాడర్ నుంచి గట్టి నెగిటివిటీ

బిగ్ స్క్రీన్స్ పై మన హీరోలు ఆకాశమంత ఎత్తులో కనిపిస్తారు. సినిమాల్లో ఆ హీరోలు ఎలాంటి సమస్యని అయినా సింపుల్ గా సాల్వ్ చేసేసుకుంటారు. కానీ మన హీరోల బయటి జీవితాలు కూడా ఇలానే ఉంటాయా అంటే డెఫినెట్ గా లేదనే సమాధానం వినిపిస్తుంది. దాదాపు తెలుగు సినిమా దగ్గర ఉన్న టాప్ హీరోలు చాలా మంది ఫ్యామిలీ పరంగా పలు కాంట్రవర్సీలలో ఉన్నవారే అని చెప్పాలి.

అలాంటి హీరోస్ లో నందమూరి లెగసి క్యారియర్ , మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా ఒకరు. ఎన్టీఆర్ .. నందమూరి బ్రాండ్ తో సినిమాలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇదే నందమూరి కుటుంబానికి నారా వారి కుటుంబంతో ఉన్న బంధం గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నందమూరి బాలకృష్ణ, నారా చంద్రబాబు నాయుడు కుటుంబాలు రాజకీయంగా ఇప్పటికీ కలిసి ఉంటున్నారు.

nara fans deeply hurted with gratitude less jr ntr

కానీ ఒక్క జూనియర్ ఎన్టీఆర్‌ని మాత్రం వీళ్లు పక్కన పెడతారు, లేదా ఎన్టీఆర్ వాళ్ళని పక్కన పెడతారు అనే టాక్ మాత్రం ఎపుడు నుంచో సినీ వర్గాల్లో ఉంది. కానీ ఎంత కాదు అనుకున్నా రెండు కుటుంబాల్లో కూడా మంచో చెడో కొన్ని సందర్భాల్లో ఒకరికొకరు తోడుగా కూడా నిలిచారు. అయితే ఇటీవలే నారా కుటుంబంలో తీవ్ర విషాదం జరిగింది.

స్వయానా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి సోదరుడు అలాగే తెలుగు సినిమా హీరో నారా రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి నాయుడు గుండెపోటుతో మరణించారు. అయితే దీనిపై నారా రోహిత్ ఎంతో చింతించగా చంద్రబాబు కూడా ఓ ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టారు. కానీ ఎన్టీఆర్ నుంచి కానీ తన సోదరుడు కళ్యాణ్ రామ్ నుంచి కూడా ఎలాంటి పోస్ట్ పడలేదు.

nara fans deeply hurted with gratitude less jr ntr

దీనితో టీడీపీ క్యాడర్ , నారా అభిమానులు ఎన్టీఆర్ విషయంలో ఫైర్ అవుతున్నారు. గతంలో ఎన్టీఆర్ నాన్న స్వర్గీయ నందమూరి హరికృష్ణ శివైక్యం అయినపుడు నారా రోహిత్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి మరీ పరామర్శించాడు. కానీ ఎన్టీఆర్ గాని కళ్యాణ్ రామ్ గాని ఇంటికెళ్లి పరామర్శించకపోవడం పక్కన పెడితే కనీసం సంఘీభావంగా అయినా నారా రోహిత్ కి ధైర్యం చెప్పడానికి కానీ చిన్న పోస్ట్ కూడా పెట్టడానికి మనసు రాలేదు అంటూ ఎన్టీఆర్ పై నారా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నారా రోహిత్ మీరు తీరని దుఃఖంలో ఉన్నపుడు పక్కన ఉన్నాడు. కానీ మీరు మాత్రం కనీసం సంతాపం కూడా తెలపలేకపోయారు అంటూ ఫైర్ అవుతున్నారు. మరి ఇలాంటి సెన్సిటివ్ విషయాన్నీ కూడా ఓ పెద్ద కుటుంబం నుంచి అది కూడా పెద్ద స్టార్ అయినటువంటి ఎన్టీఆర్ పక్కన పెట్టడం అనేది ఒకింత ఆశ్చర్యకరంగానే ఉందని రాజకీయ సినీ విశ్లేషకులు కూడా అంటున్నారు. మరి ఇది తెలియక జరిగిందా లేక తెలిసే జరిగిందా అనేది వారికే తెలియాలి.

More from Filmibeat

Read more about: ntr nara rohit chandrababu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X