twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలా మావయ్యా అదుర్స్.. రూలర్ ట్రైలర్‌పై నారా లోకేష్ స్పందన

    |

    నందమూరి నటసింహం బాలకృష్ణ.. వెండితెరపై తనదైన శైలిలో విజ‌ృంభించేందుకు సిద్దమవుతున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్‌గా తెరకెక్కిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాల్లో బాలకృష్ణ.. ఆయన మ్యానరిజానికి భిన్నంగా కథకు అనుగుణంగా నటించాడు. ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చే యాక్షన్ సీక్వెన్స్, బాలయ్య స్టైల్ డైలాగ్‌లు అందులో ఉండవు. చివరగా జై సింహా అంటూ వచ్చి రక్తపాతం సృష్టించాడు బాలయ్య. ఇక మరోసారి ఇదే రీతిలో శత్రువులను చీల్చి చెండాడేందుకు సిద్దమయ్యాడు.

    టీజర్‌తోనే ఈ మూవీ ఎలా ఉండబోతోందో చెప్పిన చిత్రబృందం.. తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్‌లో బాలయ్య తన విశ్వరూపాన్ని చూపాడు. ఇది దెబ్బతిన్న సింహంరా.. అంత తేలిగ్గా చావదు.. వెంటాడి వేటాడి చంపుద్ది, ఈ ధాన్యం తింటున్న మీరే ఇంత పొగరు చూపిస్తుంటే, దీన్ని పండించిన రైతుకు ఇంకెంత పవరు, పొగరు ఉంటుందో చూపించమంటావా లాంటి డైలాగ్‌లతో మాస్‌కు పిచ్చెక్కేలా చేస్తోన్న బాలయ్య.. ఇక రూలర్‌తో నిజంగానే నందమూరి అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చేట్టు కనిపిస్తున్నాడు.

    Nara Lokesh Comments On Nandamuri Balakrishna Ruler Trailer

    ఈ మూవీ ట్రైలర్‌పై బాలయ్య అల్లుడు నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. 'ఈ ధాన్యం తింటున్న మీరే ఇంత పొగరు చూపిస్తుంటే, దీన్ని పండించిన రైతుకు ఇంకెంత పవరు, పొగరు ఉంటుందో చూపించమంటావా?" బాలా మావయ్యా!మీ డైలాగ్ సూపర్. టోటల్ గా మీ సినిమా 'రూలర్' ట్రైలర్ అదుర్స్.దీన్నిబట్టి సినిమా దుమ్ములేపుద్దనిపిస్తోంది. ఆల్ ద బెస్ట్ బాలా మావయ్యా!' అంటూ ట్వీట్ చేశాడు. సోనాల్ చౌహాన్, వేధిక, ప్రకాశ్ రాజ్, భూమిక లాంటి తారగణం నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 20న విడుదల కానుంది.

    English summary
    Nara Lokesh Comments On Nandamuri Balakrishna Ruler Trailer. This Movie Is Directed By KS Ravikumar And Produced By C Kalyan. Bhumika, Prakash Raj, Sonal Chauhan Are Playing Important Character. This Movie Is Going To Release On 20th December.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X