Jr NTR అభిమాని అనుమానాస్పద మృతి.. వైసీపీ నేతల దాడి అయితే.. నారా లోకేష్ ట్వీట్ వైరల్
జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ మృతి సంఘటన ప్రస్తుతం రాజకీయ రంగు పులుముకొంటున్నది. అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన శ్యామ్ మరణంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని చింతలూరు గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఉరి వేసుకొన్న శ్యామ్ శరీరంపై గాయాలు ఉన్నాయి. శరీరం వేలాడుతూ పూర్తిగా నేలపైన ఉండటంతో అతడిది ఆత్మహత్య కాదని కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో తెలుగు దేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేసిన ట్వీట్ రాజకీయ రంగును పులుమునేలా చేసింది. శ్యామ్ మరణం విషయంలోకి వెళితే..
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ కాలేజ్ స్టూడెంట్. ఆయన స్వస్థలం తూర్పు గోదావరి జిల్లాలోని కొప్పిగుంట గ్రామం. శ్యామ్ చనిపోయిన ప్రదేశం చింతలూరు గ్రామం. చింతలూరు గ్రామంలో జరిగిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయంది. ఇటీవల విశ్వక్ సేన్ సినిమా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా వచ్చినప్పుడు యంగ్ టైగర్‌తో శ్యామ్ ఫోటో దిగేందుకు ప్రయత్నించాడు. అయితే శ్యామ్‌ను బాడీ గార్డులు నెట్టివేయడంతో ఎన్టీఆర్ స్వయంగా పిలిచి ఫోటో దిగడం ఆ రోజు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ మరణంపై అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. శ్యామ్ ఉరి వేసుకొని మరణించారనే విషయాన్ని నమ్మలేకపోతున్నారు. దాంతో శ్యామ్ మరణం హత్య, ఆత్మహత్యనా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియాలో వందలాది మంది శ్యామ్ మరణం వెనుక వాస్తవాలు బయటకు తీసుకు రావాలని డిమాండ్ చేస్తున్నారు.

శ్యామ్ మరణంపై నారా లోకేష్ స్పందిస్తూ... నిరుద్యోగి శ్యామ్ అనుమానస్పద మరణం అత్యంత బాధను కలిగించింది. శ్యామ్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా ప్రగాఢ సంతాపం. ఎలాంటి రాజకీయ ప్రభావం లేకుండా శ్యామ్ మరణంపై విచారణ, దర్యాప్తు జరగాలి. ఈ మరణంలో వైసీపీ లీడర్లకు సంబంధముందని స్థానికులు ఆరోపిస్తున్న నేపథ్యంలో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి. శ్యామ్‌కు న్యాయం జరుగేంత వరకు మేము పోరాటం చేస్తాం అని నారా లోకేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
శ్యామ్ మరణంపై నారా లోకేష్ స్పందించడంపై ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో స్వాగతించారు. శ్యామ్ మరణంపై స్పందించినందుకు థ్యాంక్యూ నారా లోకేష్. ఈ అనుమానస్పద మరణం వెనుక ఎవరున్నా బయటపెట్టేలా పోరాటం చేయాలి. శ్యామ్‌కు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం అని ఎన్టీఆర్ అభిమానులు ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా, శ్యామ్ అనుమానాస్పద మృతిపై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఘాటుగా స్పందిస్తున్నారు. ఏపీ పోలీసులు నిజాయితీగా విచారణ జరిపించి.. దోషులను శిక్షించాలి. అమాయకుడైన శ్యామ్ మరణం వెనుక నిజాలు బయటకు రావాలి. శ్యామ్ కుటుంబానికి న్యాయం జరగాలి అని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ గ్రూప్ ట్వీట్ చేసింది.


Click it and Unblock the Notifications











