సర్‌ప్రైజింగ్‌గా ‘ప్రతినిధి 2’ టీజర్.. జర్నలిస్ట్ మూర్తి డైరెక్షన్, రోహిత్ యాక్టింగ్ ఎలా ఉందంటే!
తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటనతో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో నారా రోహిత్ ఒకడు. విభిన్నమైన కథలతో సినిమాలు చేసి టాలీవుడ్‌లోని హీరోల్లో స్పెషల్ అనిపించుకున్న అతడు.. ఈ మధ్య కాలంలో గ్యాప్ తీసుకున్నాడు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు 'ప్రతినిధి 2' అనే సినిమాలో నటిస్తున్నాడు.
గతంలో నారా రోహిత్ 'ప్రతినిధి' అనే సినిమాలో నటించాడు. ఈ మూవీకి మంచి రెస్పాన్స్ కూడా లభించింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగానే 'ప్రతినిధి 2' మూవీ రాబోతుంది. ఈ చిత్రంతో ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దీంతో ఈ మూవీపై ఆరంభంలోనే అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని తెరకెక్కిస్తున్నారు.

విలక్షణ నటుడు నారా రోహిత్ - మూర్తి కాంబినేషన్‌లో రాబోతున్న 'ప్రతినిధి 2' మూవీకి సంబంధించిన షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయిందనే చెప్పాలి. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను శరవేగంగా జరుపుతున్నారు. ఇక, మిగిలిన అన్ని పనులనూ వీలైనంత త్వరగా పూర్తి చేసి.. సినిమాను త్వరలోనే విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
నారా రోహిత్ హీరోగా చేస్తున్న 'ప్రతినిధి 2' మూవీని ఏప్రిల్‌లోనే విడుదల చేయాలని చూస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో రోహిత్ ఓ జర్నలిస్టుగా కనిపించాడు. అలాగే, ప్రస్తుతం రాజకీయాలు ఎలా ఉన్నాయి? నాయకుల తీరు ఎలా ఉంది? అని చెప్పడానికి కొన్ని సన్నివేశాలను ఇందులో చూపించారు.
తాజాగా విడుదలైన 'ప్రతినిధి 2' టీజర్‌లో డైలాగులు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ముఖ్యంగా చివర్లో నారా రోహిత్ 'ఇప్పటికైనా కళ్లు తెరవండి. ఒళ్లు విరిచి బయటకు వచ్చి ఓట్లు వేయండి. లేదంటే ఈ దేశం వదిలి వెళ్లిపోండి. అదీ కుదరకపోతే చచ్చిపోండి' అని చెప్పే డైలాగ్ అదిరిపోయింది. మొత్తంగా ఈ టీజర్‌లో విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, డైలాగ్స్ బాగున్నాయి. దీంతో ఇది ఫుల్‌గా వైరల్ అయిపోయింది.
ఇదిలా ఉండగా.. 'ప్రతినిధి 2' మూవీని వానర ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్లపై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్‌లు నిర్మిస్తున్నారు. దీనికి మహతీ స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో ఉదయభాను, సచిన్ ఖేడ్కర్, రఘుబాబు, జిస్సూ సేన్‌గుప్తా, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











