తండ్రైన హీరో నారా రోహిత్... నారా ఫ్యామిలీలో సెలబ్రేషన్స్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫ్యామిలీలోకి సరికొత్త అతిథి వచ్చారు. ఆయన సోదరుడి కుమారుడు నారా రోహిత్- శిరీష దంపతులు తల్లిదండ్రులయ్యారు. ఇటీవల గర్భం దాల్చిన శిరీష పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో సీఎం కుటుంబంలో సరికొత్త ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. నారా రోహిత్, శిరీష దంపతులకు సినీ, రాజకీయ ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు కుమారుడే నారా రోహిత్. చెన్నైలో బీటెక్ చేసిన రోహిత్.. అనంతరం ప్రపంచ ప్రఖ్యాత న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నటనలో ఓనమాలు దిద్దారు. అనంతరం లాస్ ఏంజెల్స్‌లో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేశారు. 2009లో బాణం సినిమా ద్వారా హీరోగా వెండితెరపై అడుగుపెట్టారు. అనంతరం సోలో, సారొచ్చారు, ఒక్కడినే, ప్రతినిధి, రౌడీ ఫెలో, అసుర, తుంటరి, సావిత్రి, రాజా చేయ్యి వేస్తే, నాయకి, జో అచ్యుతానంద, అప్పట్లో ఒకడుండేవాడు, శమంతకమణి, కథలో రాజకుమారి, బాలకృష్ణుడు, ఆటగాళ్లు, వీరభోగ వసంత రాయలు సినిమాలు చేశారు.

Nara Rohith and his wife Siree Lella were blessed with Baby Boy

వ్యక్తిగత కారణాలతో దాదాపు 6 ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న రోహిత్.. 2024లో ప్రతినిధి 2 ద్వారా తిరిగి రీ ఎంట్రీ ఇచ్చారు. అనంతరం భైరవం, సుందరకాండ సినిమాలలో నటించారు. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతోన్న ఆదర్శ కుటుంబంలో నారా రోహిత్ కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాగే సోలో హీరోగా మరో సినిమాలోనూ ఆయన నటిస్తున్నారు. కమర్షియల్ సినిమాలకు భిన్నంగా వినూత్న కథలలో నటించే లోకేష్‌కు టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది.

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌లో ఒకడిగా ఉన్న నారా రోహిత్ తన బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పారు. ప్రతినిధి 2 సినిమాలో తనకు హీరోయిన్‌గా నటించిన శిరీ లేళ్ల అలియాస్ శిరీషతో ప్రేమలో పడిన ఆయన పెద్దల అంగీకారంతో తమ ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకెళ్లాడు. శిరీషది ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా రెంటచింతల. ఆస్ట్రేలియాలో మాస్టర్స్ చేసిన శిరీష.. అక్కడే కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. అయితే సినిమాలపై ఆసక్తితో భారతదేశానికి తిరిగొచ్చిన ఆమె హైదరాబాద్‌లో తన అక్క దగ్గర ఉంటూ సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ప్రతినిధి 2లో శిరీషకు అవకాశం దక్కింది. ఈ సినిమా షూటింగ్ టైంలో శిరీష- నారా రోహిత్‌ల మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.

2024 అక్టోబర్ 13న నారా రోహిత్ - శిరీషకు ఘనంగా నిశ్చితార్ధం జరిగింది. 2025 అక్టోబర్ 30న కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబంతో పాటు నారా, నందమూరి కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఈ పెళ్లిక హాజరయ్యారు. గత నెల 1వ తేదీన తాను తండ్రిని కాబోతున్నట్లుగా నారా రోహిత్ అధికారికంగా ప్రకటించారు. తన భార్య శిరీష బేబీ బంప్‌తో ఉన్న వీడియోతో పాటు సీమంతం వీడియోను రోహిత్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈరోజు శిరీష పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంతో నారా రోహిత్‌తో పాటు నారా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని తాకాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X