Prathinidhi 2 Release Date: నారా రోహిత్ ప్రతినిధి 2 సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు రాబోతుందంటే?

నారా రోహిత్.. ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రియులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అద్భుతమైన టాలెంట్ కల్గిన ఈయన ప్రతినిధి సినిమాతో సూపర్ హిట్ కొట్టి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. విభిన్నమైన కథలతో వస్తూ.. అందరినీ మెప్పించే ఈయన తాజాగా అదిరిపోయే చిత్రంతో రాబోతున్నారు. టీవీ5 మూర్తి దర్శకత్వంలో రాబోతున్న ప్రతినిధి 2 సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేశారు. అయితే ఈ క్రేజీ మూవీ ఎప్పుడు విడుదల కాబోతుందో.. థియేటర్లలో ఏరోజు సందడి చేయబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

గతంలో వచ్చిన ప్రతినిధి సినిమాలో నారా రోహిష్ హీరోగా చేశాడు. అయితే ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో.. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టుకుంది. అలా సూపర్ హిట్ కొట్టిన ఈ చిత్రానికి కొనసాగింపుగా ప్రతినిధి 2 రాబోతుంది. ఈ చిత్రంతో ప్రముఖ జర్నలిస్ట్.. టీవీ 5 మూర్తి దేవగుప్తపు దర్శకుడిగా చేయబోతున్నారు. ఆయన డైరెక్టర్ చేస్తున్న తొలి సినిమా ఇదే. టీవీ5 మూర్తి డైరెక్షన్ లో.. నారా రోహిత్ కాంబోతో.. ప్రతినిధి 2 సినిమా వస్తుందనగా.. ఆరంభంలోనే అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని తెరకెక్కిస్తున్నారు.

Nara Rohith Prathinidhi 2 Movie Official Release Date Fixed Check Details

అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రతినిధి 2 సినిమాకు సంబంధించిన టీజర్ ను ఇటీవలే విడుదల చేశారు. అద్భుతమైన కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాలో అంతకు మించిన టీజర్‌లో డైలాగులు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ముఖ్యంగా చివర్లో నారా రోహిత్ 'ఇప్పటికైనా కళ్లు తెరవండి. ఒళ్లు విరిచి బయటకు వచ్చి ఓట్లు వేయండి. లేదంటే ఈ దేశం వదిలి వెళ్లిపోండి. అదీ కుదరకపోతే చచ్చిపోండి' అని చెప్పే డైలాగ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంత మంచి కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాను వానర ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్లపై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్‌లు నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు మహతీ స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తుండగా.. ఇందులో ఉదయభాను, సచిన్ ఖేడ్కర్, రఘుబాబు, జిస్సూ సేన్‌గుప్తా, అజయ్ ఘోష్, తనికెళ్ల భరణి, సిరి లీల, దినేష్ తేజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ముఖ్యంగా మే 10వ తేదీన ఈ సూపర్ సీక్వెల్ మూవీని థియేటర్రలో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఈ క్రేజీ మూవీని మీరు కూడా థియేటర్లలో చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X