ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడుగా నారాయణదాస్ కె నారంగ్

గత కొన్ని రోజులుగా తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్నికల సందడి కనిపిస్తోంది. ఆ క్రమంలో ఈ సారి జరిగిన ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు కూడా సర్వత్రా ఆసక్తిని పెంచాయి. ఈ ఎన్నికల్లో ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి బరిలోకి దిగిన ఏసియన్ సినిమాస్ అధినేత నారాయణదాస్ కె నారంగ్ గారు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికపై పరిశ్రమ నుంచి హర్షం వ్యక్తమవుతోంది.

ఇదిలా ఉండగా, తెలుగు సినిమా పరిశ్రమలో ఫైనాన్సియర్స్ గా సుస్థిర స్తానం సంపాదించుకున్న నారాయణదాస్ నారంగ్ గారు 600కు పైగా సినిమాలకు ఫైనాన్సర్‌గా ఉన్నారు. అలాగే వందలాది సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ ఛైన్ ఆఫ్ థియేటర్స్ అయిన ఏసియన్ సినిమాస్‌ ను విజయవంతంగా నడిపిస్తూ.. పరిశ్రమలో తనదైన ముద్రను వేశారు.

Narayana Das K Narang elected as Telugu Film Chamber of Commerce

ఇప్పటి వరకూ ఫైనాన్స్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగాల్లో దూసుకుపోతోన్న ఏసియన్ సినిమాస్ రీసెంట్‌గా నిర్మాణ రంగంలోనూ అడుగుపెట్టింది. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సాయిపల్లవి జంటగా నటిస్తోన్న చిత్రంతో ఏషియన్ సినిమాస్ చిత్ర నిర్మాణం మొదలుపెట్టింది.

మొత్తంగా చిత్ర పరిశ్రమతో సుదీర్ఘ అనుబంధం ఉన్న నారాయణదాస్ నారంగ్ గారు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఆయనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నారు అందరూ. అలాగే ఆయన ముందు ముందు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నారు.

Read more about: tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X