అమెజాన్ ప్రైమ్‌లో అహం బ్రహ్మస్మి.. నారాయణదాస్ నారంగ్ చేతుల మీదుగా ట్రైలర్..
లాక్‌డౌన్ కాలంలో ఓటీటీల హవా అనూహ్యంగా పెరగడంతో విలక్షణ కంటెంట్‌తో యువ దర్శకులు ప్రయోగాలు చేస్తూ సక్సెస్ అవుతున్నారు. వినూత్న ఆలోచనలతో కంటెంట్ అందిస్తున్న ఫిల్మీ మేకర్స్‌కు ఓటీటీలు ప్రోత్సాహం అందిస్తున్నాయి. అలాంటి వినూత్నమైన కంటెంట్‌తో వస్తున్న వెబ్ సిరీస్ అహం బ్రహ్మస్మి.
లెటర్ బాక్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన సైన్స్ ఫిక్షన్ సిరీస్‌కు సిద్ధార్థ్ పెనుగొండ దర్శకుడు.
వెబ్ గేమింగ్ కథాంశంగా రూపొందిన అహం బ్రహ్మస్మి యూత్‌ను టార్గెట్‌గా చేసి రూపొందించినట్టు దర్శకుడు సిద్ధార్త్ తెలిపారు. ఆద్యంతం అద్బుతం అనిపించే స్క్రీన్ ప్లేతో తెరకెక్కించాం. అన్ని వర్గాలను ఆకట్టుకొంటుంది అని చెప్పారు.

అహం బ్రహ్మస్మి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ అగర్వాల్ విడుదల చేశారు. టీజర్‌ను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్‌లో ఒకరైన వై రవికుమార్ చేతుల మీదుగా విడుదలైంది. ట్రైలర్‌ను సీనియర్ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత ఏషియన్ గ్రూప్ ఛైర్మన్ నారాయణదాస్ నారంగ్ చేతుల మీదుగా విడుదల చేశారు.
టీజర్, ట్రైలర్‌తో భారీగా అంచనాలను పెంచిన అహం బ్రహ్మస్మి వెబ్ సిరీస్ జూలై 18నుంచి అమెజాన్ ప్రైమ్ (యూ.ఎస్), అమెజాన్ ప్రైమ్ (యూ. కే), ఎమ్ఎక్స్ ప్లేయర్, హంగామా, ఎయిర్‌టెల్ ఎక్స్ స్ట్రీమ్, విఐ లాంటి పలు ఓటిటి ప్లాట్ ఫామ్స్ నుంచి స్ట్రీమింగ్ కానున్నది.
నటీనటులు: రజత్ రాఘవ్, మౌనిమ, అభయ్ బేతగంటి, చాందినీరావు, సాయి కేతన్ రావు, కృష్ణతేజ తదితరులు
దర్శకుడు: సిద్ధార్థ్ పెనుగొండ
నిర్మాతలు: పెనుగొండ పద్మావతి, పెనుగొండ హర్షవర్ధన్, సామి వెంకట సంపత్ కుమార్, శ్రీకాకుళం సూర్య
సినిమాటోగ్రఫీ: నరేష్ రామదురై
సంగీతం: డెన్నిస్ జాక్
ఎడిటర్: అశ్వత్ శివకుమార్
ఆర్ట్ డైరెక్షన్ : ధన్విగ్నేష్ ఆమూరి
సౌండ్: ఎమ్. జ్యోతి స్వరూప్
డిఐ: అన్నపూర్ణ స్టూడియోస్
విఎఫ్ఎక్స్: శాశ్వత్ కౌరవ్
వార్డ్ రోబ్: లక్ష్మి సోలంకి
డిస్ట్రిబ్యూషన్ పార్టనర్: వన్ మీడియా
పిఆర్వో: దుద్ది శ్రీను


Click it and Unblock the Notifications











