Bharata Ratna ఎన్టీఆర్‌కు భారతరత్న? సంచలన నిర్ణయం దిశగా మోదీ ప్రభుత్వం

తెలుగు తెరపై దైవంశసంభూతుడిగా భావించే విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు సినిమాల్లో పౌరాణిక పాత్రలు పోషించి ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాడు. దాదాపు 350 చిత్రాల్లో నటించిన హీరోగా ఘనతను సాధించాడు. సినిమా రంగంలో ఎదురులేని హీరోగా తానకు తానే సాటి అనిపించుకొన్న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి చరిత్ర సృష్టించాడు. అయితే గత కొద్దికాలంగా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తున్నది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆ డిమాండ్‌ను పరిశీలిస్తున్నట్టు ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఆ వార్త వివరాల్లోకి వెళితే..

ఐదు దశాబ్దాలకుపైగా సినీ జీవితంతో ఎన్నో మరుపురాని పాత్రలను పోషించిన ఎన్టీఆర్.. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించాడు. కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి కాంగ్రెసేతర పార్టీలను కూడగట్టాడు.

Narendra Modi Government considering Bharata Ratna for Nandamuri Taraka Ramarao

అటు సినిమా రంగంలోను, ఇటు రాజకీయ రంగంలోను చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్‌కు భారతరత్నతో పురస్కారంతో సత్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు వస్తుండటం, తెలుగు దేశం, బీజేపీ, జనసేన పొత్తు కదరడంతో ఈ డిమాండ్‌ను సానుకూలంగా పరిశీలిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా జరిగే కేంద్ర మంత్రివర్గ భేటీలో ఎన్టీఆర్‌కు భారతరత్నను ఇవ్వాలనే డిమాండ్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం.

మార్చి 15వ తేదీన ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, దేశంలోని సార్వత్రిక ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఎలక్షన్ డేట్స్ ప్రకటించే సమయంలో భారతరత్న అవార్డు వార్తల్లోకి రావడం ప్రాధాన్యం సంతరించుకొన్నది. అయితే ఎన్టీఆర్‌కు భారత రత్న ఇస్తారా? లేదా ఎన్నికల తర్వాత ఆ విషయాన్ని పరిశీలిస్తారా అనేది వేచి చూడాల్సిందే. ఇటీవలే మాజీ ప్రధాని పీవీ నర్సింహరావుకు భారత రత్న అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X