Prabhas కన్నీటి పర్యంతం.. ఓదార్చిన కిషన్ రెడ్డి.. ప్రభాస్ ఫోన్ నెంబర్ కోసం ప్రధాని మోదీ!

సినీ హీరో, మాజీ కేంద్ర మంత్రి, రెబల్ స్టార్‌గా కృష్ణంరాజు ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకొన్నారు. రాజకీయాల్లోను, సినీ పరిశ్రమలోను నైతిక విలువలతో జీవితాన్ని కొనసాగించారు. ఆయన మరణంతో తీవ్ర విషాదం నెలకొన్నది. ఆయన కుటుంబానికి బీజేపీ తరఫున, ప్రధాని మోదీ తరఫున, వ్యక్తిగతంగా నా శ్రద్దాంజలి, ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కృష్ణంరాజు ఆదివారం ఉధయం తెల్లవారుజామున కన్నుమూయడంతో శ్రద్దాంజలి ఘటించారు. ఇంకా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ..

బీజేపీ భవిష్యత్ కార్యచరణపై

బీజేపీ భవిష్యత్ కార్యచరణపై

మేము కలిసిన ప్రతీసారి పార్టీ భవిష్యత్ కార్యచరణ గురించి అడిగేవారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, తమిళనాడులో నా సేవలు ఉపయోగించుకోవాలని సూచించేవారు. నరేంద్రమోదీ కోసం ప్రచారం చేస్తానని చెప్పేవారు. అయితే తాను మీరు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకొండి అని సలహా ఇచ్చాను. ఇటీవల ఢిల్లీకి రావాలని కోరారు అనే విషయాన్ని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రధాని మోదీని కలిసేందుకు ప్రయత్నం

ప్రధాని మోదీని కలిసేందుకు ప్రయత్నం

కృష్ణంరాజు ఇటీవల తనతో మాట్లాడారు. నరేంద్రమోడీని కలువాలని అనుకొంటున్నాను. ప్రభాస్‌ను కూడా తీసుకువస్తానని చెప్పారు. గతంలో కూడా చాలాసార్లు ప్రధానిని కలిసి విలువైన సమయాన్ని గడిపారు. వాజ్ పేయ్ ప్రభుత్వం ఆయన కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో మోదీతో మంచి స్నేహం, బంధం ఏర్పడింది. కాకినాడ, నర్సాపురం నుంచి ఆయన విదేశాంగ, రక్షణ, వాణిజ్య శాఖ మంత్రిగా సేవలందించారు. అలాంటి గొప్ప వ్యక్తి మన నుంచి దూరం కావడం బీజేపీకి, సినీ పరిశ్రమకు తీరని లోటు అని కిషన్ రెడ్డి తెలిపారు.

కృష్ణంరాజు కుటుంబానికి అండగా

కృష్ణంరాజు కుటుంబానికి అండగా

కృష్ణంరాజు మృతి నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను కలిశాను. ప్రభాస్‌ను కలిసి సంతాపం తెలియజేశాను. పార్టీ తరఫున బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రభాస్‌తో మాట్లాడారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రధాని మంత్రి ట్విట్టర్ ద్వారా సంతాపం ప్రకటించారు. ప్రభాస్‌తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు అని కిషన్ రెడ్డి వెల్లడించారు.

అమిత్ షా సంతాపం

కృష్ణంరాజు మృతికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతాపం తెలిపారు. ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభాస్ ఫోన్ నెంబర్ కోసం ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఇంటి వద్ద స్థలం లేని కారణంగా.. కోట్ల స్టేడియం గానీ, గచ్చిబౌలి స్టేడియం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. సోమవారం మధ్యాహ్నం తర్వాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తాం అని కిషన్ రెడ్డి చెప్పారు.

ప్రధాని మోదీ ట్వీట్ ఇదే..

ఇదిలా ఉండగా, శ్రీ యు.వి.కృష్ణంరాజు గారి మరణం నన్ను కలచివేసింది. రాబోయే తరాలు ఆయన నటనా కౌశలాన్ని , సృజనాత్మకతను స్మరించుకుంటూ ఉంటాయి. సమాజ సేవలో కూడా ఆయన ముందంజలో ఉండి రాజకీయ నాయకుడిగా తనదైన ముద్ర వేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి అని నరేంద్రమోడీ ట్వీట్ చేశారు.

కృష్ణంరాజు పొలిటికల్ కెరీర్

కృష్ణంరాజు పొలిటికల్ కెరీర్

కృష్ణంరాజు పొలిటిక్ కెరీర్ విషయానికి వస్తే.. తొలుత 1998లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పోటీ చేశారు. అనంతరం బీజేపీలో చేరిన ఆయన కాకినాడ నుంచి పోటీ చేసి రికార్డు స్థాయి ఓట్లతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో 165000 ఓట్ల భారీ మెజారిటీ విజయం సాధించారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖలో అడ్వజరీ కమిటీ సభ్యుడిగా, ఫైనాన్స్ కమిటీ మెంబర్‌గా, పరిశ్రమల శాఖలో సభ్యుడిగా పనిచేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X