RRR తెలంగాణ నుంచి RRR సూపర్‌హిట్ మూవీ.. అదే రాష్ట్రంలో RR ట్యాక్స్.. ప్రధాని మోదీ ఫైర్
దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన RRR సినిమాపై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి ప్రశంసలు గుప్పించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారత్ ప్రతిష్టను పెంచిందని అన్నారు. అలాంటి సినిమా వచ్చిన రాష్ట్రం నుంచి అక్రమంగా పన్నులు, కమిషన్ల రూపంలో ట్యాక్స్ వసూలు చేస్తుందని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం తెలంగాణలో పర్యటించారు. జహీరాబాద్ సభలో ప్రధాని మాట్లాడుతూ..
తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇండియాకు RRR మూవీ లాంటి సూపర్ హిట్ అందించింది. అయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాత్రం దేశం మొత్తం డబ్బు పంచడానికి ఈ రాష్ట్రంపై RR ట్యాక్స్ విధించింది అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు.

RRR సినిమా దేశం పేరును ప్రపంచవ్యాప్తంగా మార్మోగించింది. కానీ RR ట్యాక్స్ అవినితీని పెంచుతున్నది. తెలంగాణ రాష్ట్రమంతటా ఈ RR ట్యాక్స్ నడుస్తున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి RR ట్యాక్స్ పేరుతో కమిషన్లు తీసుకొంటూ ఢిల్లీకి దొడ్డి దారిన పంపిస్తున్నారనే చర్చ జరుగుతున్నది అని మోదీ ఆరోపించారు.
తెలంగాణలో RR ట్యాక్స్ పేరుతో వసూలయ్యే మొత్తం నుంచి కొంత మొత్తం బ్లాక్ మనీ రూపంలో ఢిల్లీకి వెళ్తున్నది. మీకు RR ట్యాక్స్‌తో ఇక్కడి ప్రజలకు ముప్పు, నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు నేను చెప్పిన విషయాలు అర్ధం చేసుకొన్నారనుకొంటాను. ఈ RR అంటే ఎవరో మీకు తెలుసు కదా అని రేవంత్ రేడ్డిపై మోదీ ఆరోపణలు చేశాడు.
అయితే ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ, సీనీ వర్గాల్లో చర్చనీయాశమయ్యాయి. ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా తీసుకొంటుంది? ప్రధాని విమర్శలకు రేవంత్ రెడ్డి ఎలా సమాధానం ఇస్తారనే విషయంపై ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











