టీవీ అవార్డులే కాదు.. సీనీ అవార్డులు కూడా.. మా అధ్యక్షుడు నరేష్

వీబీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ 2014 నుంచి తెలుగు సినిమా టీవీ, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విష్ణు బొప్పన ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సినీతారల డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. పలువురు సినీ నటీనటుల సమక్షంలో వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మా అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్, ఏపీఎఫ్‌డీసీ అధ్యక్షుడు, నిర్మాత అంబికా కృష్ణ, దర్శకుడు వీరు పోట్ల, ఐజీ కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో అంబికా కృష్ణా మాట్లాడుతూ విష్ణు బొప్పన 2014 నుంచి సినిమా రంగానికి సంబంధించిన పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. టీవీ అవార్డులతోపాటు సినీ రంగానికి అవార్డులు అందించే కార్యక్రమం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. తప్పకుండా విష్ణు మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

 Naresh comments VB Entertainment film dairy

మా అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ.. విష్ణు బొప్పన సినీ తరాలకు సంబంధించిన వివరాలతో ప్రతి ఏడాది డైరీ ప్రచురిస్తున్నాడు. నిజంగా కొత్త నటీ, నటులకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది. దాంతో పాటు ప్రతీ ఏడాది టీవీ రంగానికి అవార్డులు అందిస్తున్న విష్ణు ఇకపై సినిమా రంగానికి కూడా అవార్డులు అందించడం అభినందిస్తున్నాను అని అన్నారు.

 Naresh comments VB Entertainment film dairy

వీబీ ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత విష్ణు బొప్పన మాట్లాడుతూ...ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఇప్పటి వరకు సినిమా టివి డైరెక్టరీని 2014 నుండి ప్రచురిస్తున్నాం. అలాగే 2014 నుండి బుల్లితెర అవార్డులు అందిస్తూ వస్తున్నాం. ఈ రోజు 2019 ఫిల్మ్ అండ్ టివి డైరెక్టరీని విడుదల చేసాం. గతేడాది నుంచి వెండితెర అవార్డులను అందిస్తున్నాం. ఈ ఏడాది ఆగస్టులో ఇచ్చే అవార్డులకు సంబంధించిన పోస్టర్‌ను కూడా లాంచ్ చేసినందుకు, నాకు సపోర్ట్ అందిస్తున్న స్పాన్సర్స్‌కు ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X