Narudi Brathuku Natana Trailer Review: నరుడి బ్రతుకు నటన ట్రైలర్ రివ్యూ
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, సీ ఫర్ ఆపిల్ ప్రొడక్షన్స్‌పై సుకుమార్ బోరెడ్డి, ఎస్ స్వ్కేర్ సినిమాస్ బ్యానర్‌పై డాక్టర్ సింధూ రెడ్డి నిర్మించిన చిత్రం నరుడి బతుకు నటన. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా, రిషికేశ్వర్ యోగి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 25వ తేదీన రిలీజ్‌కు సిద్దమవుతున్నది.
శివ కుమార్ రామచంద్రవరపు, మలయాళ నటుడు నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వైవా రాఘవ్ నటించిన ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు ఊపందుకొన్నాయి.ఈ క్రమంలో ప్రేక్షకుల ముందుకు ట్రైలర్‌ను తీసుకొచ్చారు. ఈ ట్రైలర్ ఎలా ఉంది? ఏ అంశాలు ఆకట్టుకొన్నాయి? అనే వివరాల్లోకి వెళితే..

నరుడి బతుకు నటన మూవీ విషయానికి వస్తే.. సినిమానే జీవితంగా.. జీవితమే సినిమా అనే కాన్సెప్ట్‌తో రూపొందిందనే ఫీలింగ్ ట్రైలర్ కనిపించింది. సహజంగా ఉండే సన్నివేశాలు, ఆర్టిస్టుల ఫెర్ఫార్మెన్స్ చూడగానే ఆకట్టుకొనేలా ఉన్నాయి. కంటెంట్ నమ్ముకొన్న సినిమా అనే ఫీలింగ్‌ను ట్రైలర్ కల్పించిందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
యాక్టర్ కావాలనుకొన్న ఓ యువకుడు ఆడిషన్‌తో ఎమోషనల్‌గా ట్రైలర్ మొదలై.. మనసును తట్టే లేపే సీన్లు డైలాగ్స్ మరింత ఆకట్టుకొన్నాయి. శివకుమార్, నితిన్ ప్రసన్న, దయానంద్ రెడ్డి క్యారెక్టర్లు కథలో బలంగా కనిపించాయి. ట్రైలర్ చూస్తే పక్కాగా నేటివిటీతో రూపొందిన మరో రూట్ సినిమా అనే ఫీలింగ్ కలిగింది. ట్రైలర్‌తో రచయితగా, దర్శకుడిగా, ఎడిటర్‌గా, రిషికేశ్వర్ యోగి తన మార్కును చాటుకొన్నారు.
జీవితం అంటే ఏంటో తెలిస్తేనే.. నటన తెలుస్తుందని చెప్పడంతో.. ఓ తెలియని ఊరికి వెళ్తాడు. అలా కథ హైద్రాబాద్ నుంచి కేరళకు షిఫ్ట్ అవుతుంది. ట్రైలర్‌లో చూపించిన కేరళ అందాలు, సినిమాలోని ఎమోషన్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచేలా ఉన్నాయి. హాస్యం, ప్రేమ, ఎమోషన్ ఇలా అన్ని రకాల అంశాలను జోడించి ఈ చిత్రాన్ని తీశారని ట్రైలర్ చెప్పకనే చెప్పింది.
నటీనటులు: వ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వివా రాఘవ్, దయానంద్ రెడ్డి, తదితరులు
రచయిత, ఎడిటర్, దర్శకుడు: రిషికేశ్వర్ యోగి
నిర్మాతలు: జి విశ్వ ప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధు రెడ్డి
సహ నిర్మాత:వివేక్ కూచిభొట్ల
ప్రాజెక్ట్ హెడ్: ధీర్ కుమార్
సినిమాటోగ్రాఫర్: ఫహద్ అబ్దుల్ మజీద్
సంగీత దర్శకుడు: NYX లోపెజ్
రిలీజ్ డేట్: 2024-10-10


Click it and Unblock the Notifications











