వసంత కోకిల ఫస్ట్ లుక్.. అంచనాల డోస్ పెంచిన నేషనల్ అవార్డ్ విన్నర్
రానున్న రోజుల్లో బాషా బేధం లేకుండా చాలా వరకు సినిమాలు అన్ని భాషల్లో రిలీజ్ అవుతాయని చెప్పవచ్చు. కన్నడ, మలయాళం సినిమాల మార్కెట్ కూడా నేషనల్ వైడ్ గా భారీగానే పెరుగుతున్నాయి. ఇక పాన్ ఇండియా ప్రాజెక్టులు కూడా భారీగానే వస్తున్నాయి. ఇక త్వరలో జాతీయ అవార్డు గ్రహీత బాబీ సింహా హీరోగా రూపొందిస్తోన్న ట్రైలింగ్వల్ మూవీ వసంత కోకిల తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది.
ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్, ముద్ర ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా రూపొందిస్తోన్న ఈ ట్రైలింగ్వల్ మూవీని ప్రముఖ నిర్మాత రామ్ తళ్లూరి నిర్మిస్తుండగా నూతన దర్శకుడు రమణన్ పురుషోత్తమ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హీరోయిన్ గా @నర్తనశాల ఫేమ్ కాశ్మీర పర్ధేశీ నటించగా పలువురు కన్నడ ప్రముఖులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. నవంబన్ 6న బాబీ సింహా పుట్టిన రోజు ఈ సినిమా టైటిల్ వసంత కోకిలని ఎనౌన్స్ చేశారు. ఇక తమిళ నుంచి స్టార్ హీరో ధనుష్, కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి కూడా ఈ సినిమాకి సంబంధించిన తమిళ, కన్నడ టైటిల్ పోస్టర్స్ ని సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.

రొమాంటిక్ థ్రిల్లర్ జానర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాబీ సింహా విలక్షణత ప్రతిభింబిచేలా చేతిలో బౌ అండ్ యారో, ఫారేస్ట్ బ్యాక్ డ్రాప్, డార్క్ గ్రిన్ కలర్ టింట్ ఇలా ఎన్నో ఉత్కంఠ రేపే ఎలిమెంట్స్ ని ప్రజెంట్ చేశారు. దర్శకుడు రమణన్ సింహా రేంజ్ కి తగ్గట్టుగా వసంత కోకిలను తెరకెక్కించారని చిత్ర బృందం కాన్ఫిడెంట్ గా చెబుతోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా విడుదల చేస్తామని నిర్మాత రామ్ తళ్లూరి తెలిపారు.


Click it and Unblock the Notifications











