బలగం మూవీకి అన్యాయం? నేషనల్ అవార్డ్స్ లో దక్షిణాదికి మొండి చేయి! నెటిజన్ల ఫైర్
71వ జాతీయ పురస్కారాల జాబితాను ఆగస్టు 1న కమిటీ అధికారికంగా ప్రకటించింది. నేషనల్ అవార్డ్స్ 2025 పూర్తి జాబితాను నేషనల్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ విడుదల చేసింది. చిత్ర పరిశ్రమలోని ప్రధానమైన కేటగిరీల్లో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చిన వారికి అవార్డులకు ఎంపిక చేసినట్టు ప్రకటించారు. అయితే కమిటీకి ఇండియాలోని అన్నీ భాషల్లో రూపుదిద్దుకున్న చిత్రాల్లో నుంచి 332 ఫీచర్ ఫిల్మ్స్, 115 నాన్ ఫీచర్ ఫిల్మ్స్ అప్లికేషన్స్ ను అందించాయి. అన్ని విధాలుగా పరిశీలించిన తర్వాత కేటగిరీల వారీగా అవార్డ్స్ ను అందించారు. అయితే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు దక్కించుకున్న ఈ చిత్రాలకు మాత్రం కమిటీ ప్రాధాన్యత ఇవ్వకపోవడం పట్ల సినీ ప్రియులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
దక్షిణాదిలో దుమ్ములేపిన చిత్రాలు..
2023లో ప్రధానంగా దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు నుంచి బలగం చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి తొలి దర్శకత్వంలో బయటికి వచ్చిన ఆణిముత్యం ఈ చిత్రం. తెలంగాణ కల్చర్ ను చూపించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు అందాయి. థియేటర్లలోనూ బ్రహ్మాండమైన ఆదరణ దక్కింది. పలు అవార్డ్స్ ను కూడా ఈ చిత్రం దక్కించుకోవడం విశేషం. ఇలాంటి చిత్రానికి నేషనల్ అవార్డ్స్ 2025 జాబితాలో ఆశించిన స్థాయిలో చోటు దక్కలేదని సినీ ప్రియులు అభిప్రాయ పడుతున్నారు. కేవలం 'ఊరు పల్లెటూరు' పాటను నేషనల్ అవార్డ్ కు ఎంపిక చేసి, పూర్తి సినిమా సోల్ ను వదిలేశారని, తెలంగాణ ఆచారాలను, సంప్రదాయాలను చూపించిన ఈ సినిమాను అన్యాయం జరిగిందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

అలాగే తెలంగాణ ఊరమాస్ చిత్రంగా వచ్చిన దసరా సినిమాకు చిన్న చూపే మిగిలింది. అంతే కాదు నాని నుంచి వచ్చిన హాయ్ నాన్న, తెలుగు ప్రొడక్షన్ హౌజ్ లో రూపుదిద్దుకున్న ఆలోచనాత్మకమైన చిత్రం, సోషల్ మెజేస్ ఇచ్చిన చిత్రం సార్, యాక్షన్ పరంగా, విజువల్స్ పరంగా ప్రొడక్షణ్ వాల్యూను చూపించి సెన్సేషన్ క్రియేట్ చేసిన సలార్ చిత్రాన్ని కూడా గుర్తించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అలాగే సౌత్ లో 2023లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆడు జీవితం (The Goat Life) చిత్రాన్ని కూడా నేషనల్ అవార్డ్స్ కమిటీ కనీసం పట్టించుకోకపోవడం ఆశ్చర్యమని అంటున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆ చిత్రంతో అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇవ్వడం విశేషం. ఆ పాత్ర కోసం ఏకంగా ఇరవై 30 కిలోల బరువు కూడా తగ్గారంట. మరోవైపు తమిళంలోని జైలర్, విడుదల పార్ట్ 1, లియో వంటి బ్లాక్ బాస్టర్ ఫిల్మ్స్ ను కూడా పట్టించుకోలేదనే చర్చ నడుస్తోంది. ఇక మలయాళంలో ఇరట్ట, కథల్ - ది కోర్, నన్పకల్ నేరతు మయక్కం, పురుష ప్రేమం, కన్నూర్ స్క్వాడ్ వంటి సినిమాలు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.
తెలుగులో అవార్డ్ దక్కించుకున్న చిత్రాలివే..
బెస్ట్ తెలుగు ఫిల్మ్ గా నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి'కి అవార్డు దక్కింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి, ప్రొడ్యూసర్స్ సాహు గరిపాటి, హరీశ్ పెద్ది అవార్డ్ ను అందుకోబోతున్నారు. అలాగే బేబీ స్క్రీన్ ప్లే విభాగంలో, హనుమాన్ AVGC విభాగంలో, దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణి చైల్డ్ ఆర్టిస్ట్ విభాగంలో అవార్డును సొంతం చేసుకున్నారు. ఇక సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన యానిమల్ సినిమాకు కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్ విభాగంలో అవార్డ్ లు ప్రకటించడం విశేషం.


Click it and Unblock the Notifications











