National Awards 2025: మరోసారి బాలయ్య సత్తా.. యానిమల్, బేబీ, గాంధీ తాత, హనుమాన్ కు ఈ విభాగాల్లో
75వ నేషనల్ అవార్డ్స్ 2025 పూర్తి జాబితాను నేషనల్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ తాజాగా అధికారికంగా వెల్లడించింది. 332 ఫీచర్ ఫిల్మ్స్, 115 నాన్ ఫీచర్ ఫిల్మ్స్ నుంచి కమిటీకి అప్లికేషన్స్ అందాయి. ఇక ఇప్పటికే తెలుగులో బెస్ట్ యాక్టర్ గా పుష్ప : ది రైజ్ చిత్రంలో నటించిన అల్లు అర్జున్ కు 69వ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఈ 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాలకు గాను ఆయా విభాగాల్లో తాజాగా నేషనల్ అవార్డ్స్ ను ప్రకటించారు. నందమూరి బాలకృష్ణ, సందీప్ రెడ్డి వంగ, బేబీ దర్శకుడు, సుకుమార్ కూతురు సుకృతిలు సత్తా చాటడం విశేషం. ఇక ఎవరెవరికి ఏ విభాగంలో అవార్డు దక్కిందనే వివరాల్లోకి వెళితే..
బెస్ట్ తెలుగు ఫిల్మ్ గా..
2023లో తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి అదిరిపోయే చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సలార్, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, దసరా, సార్, విరూపాక్ష, బేబీ, బలగం, రంగమార్తాండ, భగవంత్ కేసరి, శాకుంతం, బ్రో, మ్యాడ్, హాయ్ నాన్న వంటి చిత్రాలు విడుదలై మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి. కాగా వీటిలో బెస్ట్ తెలుగు ఫిల్మ్ గా నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' చిత్రానికి అవార్డ్ దక్కింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి, ప్రొడ్యూసర్స్ సాహు గరిపాటి, హరీశ్ పెద్ది అవార్డ్ ను సొంతం చేసుకున్నారు.

యానిమల్ చిత్రానికి 2 కేటగిరీల్లో..
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వ వహించిన యానిమల్ చిత్రానికి నేషనల్ అవార్డ్ 2025 జాబితాలో చోటు దక్కింది. రీరికార్డింగ్ మిక్సర్ విభాగంలో రాజకృష్ణన్ స్పెషల్ మెన్షన్ గా అవార్డును అందుకున్నారు. అలాగే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విభాగంలో హర్షవర్ధన్ రామేశ్వర్ అవార్డ్ ను అందుకున్నారు. బెస్ట్ సౌండ్ డిజైనింగ్ లో సచిన్ సుధాకరన్ మరియు హరిహరన్ మురళీధరన్ అవార్డు ను సొంతం చేసుకున్నారు.
బేబీ, హనుమాన్ గాంధీ తాత చిత్రాలకు ఈ విభాగంలో..
2023లో ప్రేక్షకులను అలరించిన బెస్ట్ చిత్రాల్లో బేబీ, హనుమాన్ సినిమాలు ఉన్నాయి. ఇక ఆనంద్ దేవరకొండ - వైష్ణవి చైతన్య జంటగా నటించి బేబీ చిత్రానికి గానూ ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో సాయి రాజేష్ నీలం జాతీయ అవార్డును గెలుచుకున్నారు. అలాగే మేల్ ప్లేబ్యాక్ సింగర్ విభాగంలో పీవీఎన్ ఎస్ రోహిత్ అవార్డును సొంతం చేసుకున్నారు.
మరోవైపు దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణి చైల్డ్ ఆర్టిస్ట్ విభాగంలో గాంధీ తాత చెట్టు చిత్రంలో నటించినందుకు అవార్డ్ ను సొంతం చేసుకుంది. ఇక ప్రశాంత్ వర్మ - తేజా సజ్జా కాంబినేషన్ లో వచ్చిన హనుమాన్ చిత్రం బెస్ట్ యానిమేషన్, విజువల్స్, గేమింగ్, కామిక్స్ విభాగంలో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఇక 2023లో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న బలగం చిత్రానికి బెస్ట్ లిరిక్స్ విభాగంలో కాసర్ల శ్యామ్ కు అవార్డు అందడం విశేషం.


Click it and Unblock the Notifications











