For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    National Film Awards 2019: జాతీయ సినీ అవార్డులు.. మెగాస్టార్ చిరంజీవి మాట నిజమైంది..

    |

    ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను దేశ రాజధాని దిల్లీలో శుక్రవారం ప్రకటించారు. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ప్రకటించారు. కాగా ఈసారి జాతీయ పురస్కారాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి 'మహానటి', 'రంగస్థలం', 'అ!', చిలసౌ' చిత్రాలకు అవార్డులు దక్కాయి. తెలుగు నుంచి ఉత్త‌మ చిత్రంగా మ‌హాన‌టి ఎంపికైంది. ఉత్త‌మ న‌టిగా కీర్తి సురేష్, ఉత్తమ కాస్ట్యూమ్స్‌ డిజైనర్ విభాగంలోనూ మ‌హాన‌టి ఖాతాలో అవార్డులు చేరాయి.

    ఇక మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయకుడిగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను తిర‌గ‌రాసిన రంగ‌స్థ‌లం బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగం నుంచి ఎంపికైంది. బెస్ట్ ఒరిజిన‌ల్ స్క్రీన్ ప్లే నుంచి చిల‌సౌ కు, అ చిత్రానికి గాను, ఉత్తమ మేకప్ , ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్ విభాగంలో అవార్డులు ద‌క్కాయి.

    National Best Film awards: Chiranjeevi expectations become realty

    ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి అవార్డులు పొందిన వారంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు.

    మ‌హాన‌టి, రంగ‌స్థ‌లం చిత్రాల‌కు జాతీయ అవార్డ‌ులు వ‌స్తాయ‌ని మెగాస్టార్ రిలీజ్ కు ముందుగానే చెప్పిన సంగ‌తి తెలిసిందే. మ‌హాన‌టి రిలీజ్ అనంత‌రం చిరంజీవి యూనిట్ స‌భ్యుల‌ను ఇంటికి పిలిపించి ఘ‌నంగా స‌న్మానించిన సంగ‌తి విధిత‌మే. తాను ఊహించినట్టుగానే ప్రస్తుతం ఆ రెండు సినిమాలకు అవార్డులు రావడంతో సంతోషాన్ని వ్య‌క్తం చేసారు. త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ న‌టించిన రంగ‌స్థ‌లంకు జాతీయ అవార్డు రావ‌డం. అలాగే ఇత‌ర భాష‌ల నుంచి అవార్డ‌ల‌కు ఎంపికైన వారంద‌రికీ మెగాస్టార్ అభినంద‌న‌లు తెలిపారు.

    ఉత్తమ ప్రాంతీయ చిత్రం - మహానటి

    ఉత్తమ నటి - కీర్తి సురేష్ (మహానటి)

    ఉత్తమ కాస్ట్యూమ్స్ - మహానటి

    ఉత్తమ మేకప్ - ఆ !

    ఉత్తమ స్క్రీన్ ప్లే - చిలసౌ

    ఉత్తమ ఆడియోగ్రఫి రంగస్థలం

    English summary
    The winners of the 66th National Film Awards have been announced. While normally, the recipients of the National Film Awards are announced in April and the presentation takes place on May 3 every year, it was delayed this time owing to the Lok Sabha polls.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X