టాలీవుడ్‌‌కు మరో వారసురాలు: ‘దెయ్యంతో సహజీవనం’తో నట్టి కుమార్ కూతురు ఎంట్రీ!

టాలీవుడ్‌లోకి మరో సినీ వారసురాలు అడుగుపెట్టబోతున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో హిట్ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ కుమార్తె నట్టి కరుణ నట జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్దమవుతున్నారు. తన తండ్రి నిర్మాత నట్టికుమార్ దర్శకత్వంలో సోదరుడు నట్టి క్రాంతి నిర్మిస్తున్న DSJ (దెయ్యంతో సహజీవనం చిత్రం ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నట్టి లక్ష్మీ, అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించడం విశేషం. జూన్ 12వ తేదీన మ్యాగో మ్యూజిక్ ద్వారా మొదటి పాట రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా నిర్మాత నట్టి క్రాంతి మాట్లాడుతూ... గతంలో మంచి కంటెంట్‌తో వచ్చిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను ప్రేక్షకులు ఆదరించిన సందర్భాలు ఉన్నాయి. దెయ్యంతో సహజీవనం చిత్రం కూడా అలాంటి విజయం సాధిస్తుందనే విశ్వాసం మా టీమ్‌లో ఉంది. నట్టి బ్యానర్‌లో నట్టి కరుణ నిర్మాతగా పలు సినిమాలు నిర్మించి సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ అని నిరూపించుకొన్నారు. నటిగా కూడా ప్రేక్షకుల మన్ననలు పొందుతారని ఆశిస్తున్నాం. ఈ చిత్రంలో సుపూర్ణ మాలకర్ కీలక పాత్రలో నటించారు. కరోనా సమయంలో కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేశాం అని అన్నారు.

Natti Karuna acting debut with DSJ: Dayyam Tho sahajeevanam

దర్శకుడు నట్టికుమార్ మాట్లాడుతూ... DSJ చిత్రం విభిన్నమైన కథాంశంతో రూపొందింది. ఉన్నత విద్యను చదువుకోవడమే కాకుండా గోల్డ్ మెడల్ సాధించిన ఓ అమ్మాయిని నలుగురు ఎలా మోసం చేశారు. వారిపై ఆమె ఎలా ప్రతీకారం తీర్చుకొన్నదనేది ఈ సినిమా మూల కథ. నా కూతురు సినిమాలో మంచి పాత్రను పోషించడమే కాకుండా సింగిల్ టేక్‌లో సీన్లను క్లియర్ చేశారు. అందుకు గర్వంగా ఉంది. ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకొంటుందని తెలిపారు.

Natti Karuna acting debut with DSJ: Dayyam Tho sahajeevanam

నటీనటులు: నట్టి కరుణ, సుపూర్ణ మాలకర్, రాజీవ్, హరీష్ చంద్ర, బాబు మోహన్, హేమంత్, స్నిగ్ధ, తదితరులు
డైరెక్టర్: నట్టి కుమార్
నిర్మాత: నట్టి క్రాంతి
కెమెరామెన్: కోటేశ్వరరావు
సంగీతం: రవి శంకర్
ఎడిటింగ్: గౌతంరాజు
ఆర్ట్: కేవీ రమణ
ఫైట్స్: కే అంజిబాబు
పిఆర్వో: మధు వీ ఆర్
బ్యానర్: నట్టిస్ ఎంటర్‌టైన్‌మెంట్
సమర్పణ: నట్టి లక్ష్మీ, అనురాగ్ కంచర్ల

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X