ఇండస్ట్రీకి వైఎస్ జగన్ మేలు ఏంటి? పవన్ కల్యాణ్ తప్పేంటి? నారాయణమూర్తిపై నట్టి కుమార్ ఫైర్

థియేటర్ల బంద్ విషయంలో డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ కార్యాలయం నుంచి లేఖ రావడంపై నిర్మాత, నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి చేసిన విమర్శలపై చిన్న నిర్మాతల సంఘం నేత, నిర్మాత నట్టి కుమార్ ఘాటుగా స్పందించారు. పర్సంటేజ్ విధానాన్ని డిస్టిబ్యూషన్ రంగంలో కొనసాగించాలంటూ జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లు మూసి వేయాలని డిస్టిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్లు ప్రకటించడం వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి వచ్చి లేఖను ఆర్ నారాయణమూర్తి తప్పుపట్టడంపై నట్టి కుమార్ నిలదీశారు. ఆయన హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఘాటుగా మాట్లాడుతూ..

ఆర్ నారాయణమూర్తి వైసీపీ పార్టీకి తరఫున ఇండస్ట్రీతో జరిగిన మీటింగ్‌కు వెళ్లారు. చిరంజీవి, ఇతర అగ్ర నటులు వెళ్లిన సమయంలో చిన్న నిర్మాతలమైన మమ్మల్ని పిలువకుండా పోసానితో సహా ఆయన వెళ్లారు. ఎందుకంటే చిన్న నిర్మాతల తరఫున నారాయణమూర్తి పోరాటం చేస్తున్నారనే ఉద్దేశంతో పోసాని ఆయననే తీసుకెళ్లారు. ఈ సమయంలో చిరంజీవి గారిని అవమాన పరిచినప్పుడు నారాయణమూర్తి ఏమయ్యాడు? ఆ సమయంలో వైఎస్ జగన్, కేసీఆర్‌కు అతి దగ్గరగా ఉన్న విషయం కాదా? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని నట్టి కుమార్ ప్రశ్నించాడు.

Natti Kumar befitting Reply to R Narayan Murthy

మీకు ఎగ్జిబ్యూటర్లు, డిస్టిబ్యూటర్ల సమస్యలు అసలు తెలియదు. మీరు తీసిన సినిమాలన్నీ దిల్ రాజు డిస్టిబ్యూట్ చేశారు. ఆయన మీకు పర్సంటేజ్ విధానంపై చేశారా? రెంట్ పద్దతిన డిస్టిబ్యూట్ చేశారా? అనే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి అని నట్టి కుమార్ డిమాండ్ చేశారు. కమ్యూనిజం సిద్దాంతాలతో చిన్న నిర్మాతకు మేలు చేయాలంటే బంద్ అనేది బ్రహ్మస్త్రం అనడం కరెక్టే. మీరు పాప్ కార్న్ 500 రూపాయలు, కోక్ 300 రూపాయలకు అమ్మినప్పుడు మీరు ప్రశ్నించలేదే? బుక్ మై షోలో కమిషన్ ఎగ్జిబ్యూటర్లకు వెళ్తుంటే ప్రశ్నించలేదే అని నట్టి కుమార్ మాటల బాణాల్ని అన్నారు.

డిస్టిబ్యూషన్ రంగంలోని గుత్తాధిపత్యానికి మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే ఈ సమస్యలపై ప్రశ్నించలేదు. మీ భావాలు మారాయి. పేద నిర్మాతను వదిలేసి.. కార్పోరేట్ కంపెనీలకు మద్దతు పలుకుుతున్నారు? కేసీఆర్, వైఎస్ జగన్ సమయంలో ఇలాంటి ప్రశ్నలు మీ వద్ద నుంచి ఎందుకు రాలేదు? ఆ రోజు వైఎస్ జగన్‌ను కలిసినప్పుడు చిన్న నిర్మాతల కోసం మీరు ఏం చేశారు? ప్రభుత్వం తరఫున ఏం సాధించారో చెప్పాలి? చిన్న నిర్మాతల పేరు చెప్పి మోసం చేసింది నిజం కాదా? 15 సంవత్సరాల నుంచి చిన్న సినిమాలకు 5వ షో కావాలని అడుగుతున్నాం. దాని గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు అని నట్టి కుమార్ ప్రశ్నించారు

Natti Kumar befitting Reply to R Narayan Murthy

పవన్ కల్యాణ్ ఆ సమస్యను సాల్వ్ చేసి ఉండాలని అన్నారు. అసలు ఏం సమస్య ఉంది? పవన్ కల్యాణ్‌కు సంబంధం ఏమిటి? ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ తేల్చుకోవాలనే విషయం మీకు తెలియదా? పవన్ కల్యాణ్ పేరు ఎందుకు ఎత్తారు? దుర్గేష్ పేరు ఎందుకు ఎత్తారు? ప్రభుత్వం గురించి ఎందుకు విమర్శలు చేశారు? వైఎస్ జగన్ ప్రభుత్వం 5 రూపాయలకు టికెట్ అమ్ముతుంటే? పవన్ కల్యాణ్ సినిమాకు 35 రూపాయలకు అమ్ముతుంటే.. పరిశ్రమను రోడ్డు మీదకు తీసుకొస్తే.. అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? అని ప్రశ్నించారు.

పవన్ కల్యాణ్ సినిమా ఇండస్ట్రీకి పరిశ్రమ హోదా రావాలని కృషి చేస్తున్నారు. ఇండస్ట్రీ స్ట్రాంగ్‌గా నిలబడాలని ఆశిస్తున్నారు. అలాంటి వ్యక్తిపై మీరు విమర్శలు చేస్తారా? సత్యనారాయణను జనసేన నాయకుడు అంటారా? ఆయన ముందు డిస్టిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్.. ఆ తర్వాతే ఆయన జనసేన లీడర్. వారిద్దరిపై మీరు ఎందుకు విమర్శలు చేస్తున్నారు? ఇండస్ట్రీలో ఆ నలుగురు కాకుండా అందరూ కలిసి రావాలని సూచించడం తప్పా? వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఇండస్ట్రీకి ఏమైనా చేశారా? అని నట్టి కుమార్ ప్రశ్నించారు.

Natti Kumar befitting Reply to R Narayan Murthy

పాప్ కార్న్, కూల్ డ్రింక్ ధరలను థియేటర్లలో తగ్గించాలని పవన్ కల్యాణ్ మాట్లాడుతుంటే.. మీరు కమ్యూనిస్ట్‌గా పేద ప్రజలకు మేలు జరుగుతుంటే మీరు ఎందుకు అడ్డుకొంటున్నారు? మీ సమావేశాన్ని లైవ్ ఇచ్చిన టీవీ ఛానెల్, ఆ పార్టీకి ఒకటే చెబుతున్నా.. మీరు పరిశ్రమకు నరకం చూపించారు. భీమ్లా నాయక్ సినిమా సమయంలో మీరు థియేటర్లను ఎందుకు సీజ్ చేశారు? పవన్ కల్యాణ్ సినిమా రిలీజ్ సమయంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఎన్ని థియేటర్లు సీజ్ చేశారో నేను లిస్ట్ బయట పెట్టాలా? అని నట్టి కుమార్ ప్రశ్నించారు.

పాప్ కార్న్, కూల్ డ్రింక్, ఇతర తిను బండారాల ధరలు తగ్గించడాన్ని వ్యతిరేకిస్తున్నారా? లీజు గుత్తాధిపత్యం చేస్తున్న వారికి సపోర్ట్ చేస్తున్నారా? అధిక ధరలను అడ్డుకొని.. పేదవాడికి వినోదం దూరం అవ్వకుండా చర్యలు తీసుకుంటున్న పవన్ కల్యాణ్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నావు? పవన్ కల్యాణ్ చేసిన అన్యాయం ఏమిటి? వైఎస్ జగన్ చేసిన న్యాయం ఏమిటి? పవన్ కల్యాణ్ తప్పు ఎక్కడ చేశారా?.. వైఎస్ జగన్ మేలు ఎక్కడా చేశాడో చెప్పండి? జూన్ 1వ తేదీ నుంచి థియేటర్ల బంద్ ప్రకటిస్తూ ఛాంబర్‌కు లెటర్ ఇచ్చిన విషయం మీకు తెలియదా? మీరు సమావేశం పెట్టడానికి లైవ్ ఇచ్చిన టీవీ ఛానెల్, ఆ సంస్థ మీకు చెప్పలేదా? అని నట్టి కుమార్ ప్రశ్నించారు.

ఇండస్ట్రీలోను, ప్రజల్లోను ఎంతో అభిమానం ఉండే ఆర్ నారాయణ మూర్తి రాజకీయపరమైన కామెంట్స్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. గతంలో ఆయన ముక్కుసూటిగా కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడటం తెలిసిందే. కానీ ఓ రాజకీయ నేతను టార్గెట్ చేసి పాలిటికల్‌ కామెంట్స్ చేయడం వివాదంగా మారింది. అలాగే ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై నిర్మాత నట్టి కుమార్ వ్యాఖ్యలు చేయడం ఈ వివాదం మరింత పెరిగేలా ఉంది. థియేటర్ల బంధ్, పర్సంటేజీ వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో అనే ఆసక్తి పెరిగింది. ఈ వివాదంపై ఎక్స్ క్లూజివ్ అప్ డేట్స్ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

More from Filmibeat

Read more about: natti kumar pawan kalyan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X