‘ఆ తప్పు ముమ్మాటికి ప్రభాస్‌దే.. రాజాసాబ్ విషయంలో మారుతిది ఓవర్ కాన్ఫిడెన్స్’
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన కలెక్షన్లను నమోదు చేసింది. ఈ సినిమాపై క్రిటిక్స్, సాధారణ ప్రజలు పెదవి విరిచినా.. టాక్‌తో సంబంధం లేకుండా ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లు సాధించడమే కాకుండా విమర్శకుల కామెంట్లకు తాళం వేసింది. అయితే ఈ సినిమా రూపొందించిన విధానంపై దర్శకుడు మారుతిపై రకరకాలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ది రాజా సాబ్ చిత్రంపై వస్తున్న నెగిటివ్ టాక్ గురించి నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వెల్లడించిన అభిప్రాయాల వివరాల్లోకి వెళితే..
భారతీయ సినిమా పరిశ్రమలో ప్రభాస్ ఒక శిఖరం లాంటి వ్యక్తి. ఆ శిఖరాన్ని అందుకోవాలంటే సరైన దర్శకుడు ఉండాలి. మారుతి చిన్న దర్శకుడు. అలాంటి వ్యక్తికి ప్రభాస్ లాంటి పెద్ద హీరో సినిమా అవకాశం ఇవ్వడం తప్పే. రాజాసాబ్ సినిమా వరకు ప్రభాస్ తన డ్యూటీ తాను పర్‌ఫెక్ట్‌గా చేశాడు. ఆయన యాక్టింగ్ విషయంలో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. దర్శకుడిగా మారుతి ఫెయిల్ అయ్యాడు. సినిమాకు సంబంధించి స్క్రీన్ ప్లే సరిగ్గా చేయలేకపోయాడు. ప్రభాస్ స్థాయి, ఇమేజ్‌కు తగిన సినిమాను చూపించలేకపోయాడు అని నిర్మాత నట్టికుమార్ అభిప్రాయపడ్డారు.

బాహుబలి తర్వాత ప్రభాస్ ఇమేజ్ అందనంత ఎత్తులో ఉంది. మారుతి చిన్నస్థాయి వ్యక్తి. ఆయనను అందుకోవడం అతడికి సాధ్యం కాలేదు. మారుతిలో దర్శకత్వ లోపం కనబడుతున్నది. కానీ ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి హీరోలకు టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లు ఉంటాయి. వారు నటించిన సినిమా ఫ్లాఫా? హిట్టా? అనేది ఎవరూ చూడరు. ప్రస్తుతం సంక్రాంతి పండుగ సెలవులు ఉన్నాయి. కాబట్టి ఆయనను సొంత మనిషిలా భావించే వారంతా ఈ సినిమాను ఆదరిస్తారు అని నట్టికుమార్ అన్నారు.
ఒకవేళ రాజాసాబ్ చిత్రం ఒకశాతం నిరాశపరిచినా నా ఇంటికి వచ్చి నిలదీయవచ్చు. నా ఇంటి అడ్రస్ ఇదే అంటూ మారుతి చెప్పడం ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్. ప్రభాస్ రేంజ్ వేరు. ఆయన రేంజ్‌కు తగినట్టు మారుతి సినిమా చేయలేదు. ఆయన స్థాయిలో సినిమా తీయాలంటే.. రాజమౌళి, ప్రశాంత్ నీల్ లాంటి దర్శకులకే సాధ్యం.వారు మాత్రమే ఆయన స్థాయికి తగ్గ సినిమాలు తీయగలరు అని నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ది రాజా సాబ్ విషయానికి వస్తే.. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు పాపులర్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, ఇషాన్ సక్సేనా నిర్మాతలుగా వ్యవహరించారు.
ఈ చిత్రంలో ప్రభాస్‌తో సంజయ్ దత్, బోమన్ ఇరానీ, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కార్తీక్ పళని సినిమాటోగ్రాఫర్‌గా, ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వర్తించారు. ఈ చిత్రం 2026 సంవత్సరం జనవరి 9వ తేదీన సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











