RC16: గ్లోబల్ స్టార్ సరసన సాయి పల్లవి.. ఇదే నిజమైతే హైబ్రిడ్ పిల్ల లెవల్ పెరగడం ఖాయం!
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పేరు వినగానే తెలుగు సినీ ప్రేక్షకులకు వెంటనే గుర్తొచ్చేవి.... భానుమతి ఒక్కటే పీస్... రెండు కులాలు, రెండు మతాలు అంటూ చెప్పే డైలాగ్. అదే కాకుండా బాడ్ కావ్ బొక్కలు ఇరగ్గొడ్త డైలాగ్. చాలా స్వీట్ అండ్ క్యూట్ గా సాయి పల్లవి చెప్పిన ఈ డైలాగ్ లతో ఫిదా సినిమా రేంజ్ యే పెరిగిపోయింది. ముఖ్యంగా మొదటి సినిమాతోనే ఫుల్ క్రేజ్ సంపాధించుకున్న ఈ క్యూట్ బ్యూటీ విపరీతమైన క్రేజ్ ను అందుకుంది.
తాను చేసే ఈ సినిమాలోని పాత్రల కోసమైనా ప్రాణం పెట్టి నటించే ఈ న్యాచురల్ బ్యూటీ.. అత్యంత సహజంగా నటించగలదనే పేరు కూడా తెచ్చుకుంది. వీలయినంత వరకూ బోల్డ్ సన్నివేషాలకు దూరంగా ఉండడంతో పాటు పొట్టి పొట్టి బట్టల్లో కనిపించుకండా ఉంటుంది. ఎక్కువగా లంగావోణీ, చీరల్లోనే దర్శనం ఇస్తూ.. మేకప్ కూడా లేకుండానే సినిమాల్లో నటిస్తుంటుంది. ఇలాంటివవేమీ చేయకపోయినా ఆమె అందం, అభినయానికి లక్షల్లో అభిమానులు ఉన్నారు. అయితే చివరగా ఈ ముద్దుగుమ్మ విరాట పర్వం, గార్గి చిత్రాల్లో నటించి మెప్పించింది.

ఈ రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేదు. ఇక ఆ తర్వాత నుంచి సాయి పల్లవి ఏ తెలుగు చిత్రంలోనూ కనిపించలేదు. కానీ తాజాగా ఈమె తెలుగులో ఓ సినిమా చేయబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో ఛాన్సు కొట్టేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న రామ్ చరణ్.. ఈ సినిమా పూర్తి అవ్వగానే డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి RC16 అనే చిత్రం చేయబోతున్నారు.

అయితే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రంలో రాణ్ చరణ్ సరసన నటించబోయేది వీళ్లే అంటూ చాలా మంది పేర్లు వినిపించాయి. ముఖ్యంగా గతంలో రవీనా టాండన్ కుమార్తె రషా థడానీ, కీర్తి సురేష్ వంటి వాళ్ల పేర్లు వినిపించాయి. అయితే వీటిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో మరోసారి కొత్త పేరు తెరపైకి వచ్చింది. హీరోయిన్ సాయి పల్లవి ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ పక్కన కన్ఫార్మ్ గా నటిస్తుందని అంతా అనుకుంటున్నారు. ఇదే విషయమై చిత్రబృందం ఆమెను సంప్రదించినట్లు సమాచారం. నిజంగానే ఆమెకు ఆఫర్ వెళ్లిందా లేదా ఒకవేళ వెళ్తే.. నిజంగానే ఆమెకు ఈ చిత్రానికి ఓకే చెప్పిందా అనేది తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

ఇదిలా ఉండగా.. హీరో విజయ్ సేతుపతి ఈ సినిమాలో రామ్ చరణ్ కు పోటీగా విలన్ గా కనిపించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇప్పటి వరకు ఈ చిత్రంలో నటీనటులు ఎవరు అనేది చిత్రబృందం ప్రకటించలేదు. సాయి పల్లవి ఫిక్స్ అయితే మాత్రం కచ్చితంగా అధికారిక ప్రకటన చేస్తారని సమాచారం.


Click it and Unblock the Notifications











