ఆ సినిమాతో షాక్.. అందుకే అలా చేయడానికి భయపడుతున్నా.. నానీ

ఎంసీఏ సినిమాతో కమర్షియల్‌గా, జెర్సీ చిత్రంతో ఎమోషనల్ యాక్టర్‌గా ఆకట్టుకొన్న నేచురల్ స్టార్ నాని తాజాగా గ్యాంగ్ లీడర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. చిరంజీవి కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచిన సినిమా టైటిల్‌ను పెట్టుకోవడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. మనం ఫేమ్ విక్రమ్ కుమార్ రూపొందించిన ఈ చిత్రంలో సీనియర్ నటులు లక్ష్మీ, శరణ్యలు కీలక పాత్రలన పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో నాని మీడియాతో ముచ్చటించారు. నాని చెప్పిన మాటలు ఇవే..

ఇంతకు ముందు నేను ద్విభాషా చిత్రాల్లో చేయడానికి ట్రై చేసినప్పుడు ఏం జరిగిందో తెలుసు. ఆ సినిమాలు నాకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. అందుకే నాకు బైలింగ్వెల్‌ అంటే భయం. అదిరిపోయే స్క్రిప్ట్‌తో మంచి సెటప్‌ కుదిరి అలాగే రెండు రాష్ట్రాలకు బాగుంటుంది. అందరికీ నచ్చే ఎలిమెంట్స్‌ ఉన్నాయి అంటేనే బైలింగ్వెల్‌ సినిమా చేస్తాను. అంతే కాని ఇంకో చోట కూడా కలెక్షన్స్‌ వస్తాయి కదా అని బైలింగ్వెల్‌ చేయడం కరెక్ట్‌ కాదని నా ఫీలింగ్‌.

 Natural Star Nani about bilingual movie

జెర్సీ చిత్రం కొరకు మానసికంగా, శారీరకంగా చాలా కష్టపడాల్సి వచ్చింది, గ్యాంగ్ లీడర్ విషయంలో అలా కాదు. విక్రమ్ కుమార్ వలన గ్యాంగ్ లీడర్ షూటింగ్ స్మూత్ గా హ్యాపీ గా గడిచిపోయింది.

సినీ పరిశ్రమలో హీరోగా మారి 11ఏళ్ల సమయం ఎప్పుడైందో కూడా తెలియనంతగా కాలం గడిచిపోయింది. ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాను. ఇన్నేళ్ళుగా నన్ను ఆదరిస్తున్న అభిమానులకు ఈ సందర్భంగా కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను

'వి' సినిమా రెండో షెడ్యుల్‌ ఈ నెల 15 నుంచి థాయిలాండ్‌లో మొదలవుతుంది. నెక్స్ట్‌ మూడు సినిమాలు పైప్‌లైన్‌లో ఉన్నాయి. అందులో నెక్స్ట్‌ ఏది అనేది ఇంకా ఫిక్స్‌ అవ్వలేదు, 'వి ' సినిమా తరువాతే వాటి గురించి ఆలోచిస్తాను. అంటూ ఇంటర్వ్యూ ముగించారు నేచురల్‌ స్టార్‌ నాని.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X