మరో సినిమాపై క్లారిటీ ఇచ్చిన నాని.. డైరెక్టర్ ఎవరంటే?

నేచురల్ స్టార్ నాని ఎలాంటి సినిమా చేసినా కూడా వీలైనంత వరకు నష్టాలు రాకుండా ఉంటాయనేది నిర్మాతలకు గట్టి నమ్మకం. ఇక సరైన కథ తగిలితే మాత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయని చెప్పవచ్చు. అందుకే ఒకసారి నిరాశపరిచినా కూడా మైత్రి మూవీ మేకర్స్ మరోసారి ఈ హీరోతో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టింది. గ్యాంగ్ లీడర్ సినిమా అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాలేకపోయింది. దీంతో అదే ప్రొడక్షన్ లో మరో సినిమా చేస్తానని మాట ఇచ్చాడు నాని.

గత కొంతకాలంగా మైత్రి మూవీ మేకర్స్ అనేక రకాల కథలు వినగా అవి నానికి అంతగా నచ్చలేదట. ఇక మెంటల్ మదిలో, బ్రోచేవారేవరురా! వంటి సినిమాతో మంచి హిట్స్ అందుకున్న టాలెంటేడ్ యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ నానితో లాక్ డౌన్ ముందు నుంచే ట్రావెల్ అవుతున్నాడు. ఒక కథలో మార్పులు కావాలని కోరడంతో సరికొత్తగా సెట్ చేసుకోగా నాని నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇక మైత్రి మూవీ మేకర్స్ కొద్దీ సేపటి క్రితమే అఫీషియల్ గా ఎనౌన్స్మెంట్ ఇచ్చింది.

Natural star nani another project with muthi movie makers

ఇక సినిమాకి సంబంధించిన టైటిల్ పోస్టర్ నవంబర్ 21న విడుదల చేయబోతున్నాట్లు తెలిపారు. మళయాళం బ్యూటీ నజ్రియా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. నానికి ఇది 28వ సినిమా. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ అనే మరో డిఫరెంట్ పిరియాడిక్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. మరి ఈ సినిమాలతో నాని తన మార్కెట్ ని ఏ రేంజ్ కి పెంచుకుంటాడో చూడాలి.

Natural star nani another project with muthi movie makers

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X