twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు హీరో సక్సెస్ కోసం.. ABCD అంటున్న నేచురల్ స్టార్ నాని

    |

    Recommended Video

    It's Nani For Mega Hero's Film Event || Filmibeat Telugu

    టాలీవుడ్‌లో యంగ్ హీరోల హవా కొనసాగుతోంది. ఒకరికోసం ఒకరుగా ముందగుడులు వేస్తూ మిరాకిల్ సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో ఏ సినిమాకైనా చిత్ర షూటింగ్ పూర్తయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ఆ వెంటనే ప్రమోషన్ కార్యక్రమాలే ఆ చిత్ర విజయంలో అసలైన పునాదులు. అయితే ప్రస్తుతం యంగ్ హీరోలంతా ఒకరికి ఒకరు తోడవుతూ చిత్ర ప్రమోషన్స్ చేపట్టడం ప్రేక్షక లోకాన్ని థియేటర్లకు పరుగులు పెట్టిస్తోంది. ముఖ్యంగా విడుదలకు ముందు జరిపే ప్రీ రిలీజ్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ, వేదికపైకి పాపులర్ స్టార్స్‌ని తీసుకొచ్చి తమ సినిమాలకు భారీ హైప్ తీసుకొస్తున్నారు నేటితరం దర్శక, నిర్మాతలు. ఇటీవలే 'మహర్షి' ప్రీ రిలీజ్ వేడుకకు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, విక్టరీ వెంకటేష్ హాజరై ఆ సినిమా విజయంలో పాత్రులు కాగా తాజాగా అల్లు వారబ్బాయి సినిమా కోసం మరో యంగ్ హీరో నాచురల్ స్టార్ నాని రంగంలోకి దిగుతున్నారు.

    మరోవైపు యంగ్ హీరోలు తమ తోటి హీరోలకు అండగా నిలుస్తూ వారి సినిమాలపై అంచనాలు పెంచేస్తున్నారు.అదే కోవలో తాజాగా అల్లువారబ్బాయి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హంగామా చేసేందుకు రెడీ అయ్యారు నాచురల్ స్టార్ నాని. అల్లు శిరీష్ హీరోగా రూపొందిన కొత్త సినిమా 'ఏబీసీడీ' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిధిగా నాని విచ్చేయనున్నారు. ఈ వేడుక మే 13 వ తేదీ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో ఘనంగా జరగనుంది.

    అల్లు శిరీష్ 'ఎబిసిడి' చిత్రానికి క్లీన్ సెన్సార్ సర్టిఫికెట్అల్లు శిరీష్ 'ఎబిసిడి' చిత్రానికి క్లీన్ సెన్సార్ సర్టిఫికెట్

    CMS Article Management

    అల్లు శిరీష్ హీరోగా నూతన దర్శకుడు సంజీవ్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'ఏబీసీడీ'. ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని క్లీన్ 'యూ' సర్టిఫికెట్ పొందింది. మరోవైపు రీసెంట్‌గా రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రోమోస్ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను పెంచేశాయి. చిత్రంలో అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లార్ హీరోయిన్‌గా నటిస్తోంది.

    కమెడియన్ భరత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దగ్గుబాటి సురేష్ బాబు సమర్పణలో బిగ్ బెన్ సినిమాస్, మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి మధుర శ్రీధర్ నిర్మాతగా వ్యవహరించారు. అల్లు శిరీష్ కెరీర్‌కు సక్సెస్ రుచి చూపించనుందని ఆశిస్తున్న ఈ చిత్రం మే 17న విడుదల కానుంది.

    English summary
    Allu sirish's ABCD movie getting ready for release. This movie set to release on May 17th. In this occassion, Unit planned for pre release event. and the roped Natural Star Nani as chief guest.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X