Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హీరో నానిపై బెట్టు సాధించిన టాప్ ప్రొడ్యూసర్.. స్పీచ్‌తో అదరగొట్టిన నేచురల్ స్టార్!
సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై రమేష్ కుమార్ గంజి సమర్పణలో సంతోష్ శ్రీనివాస్ రౌతు దర్శకత్వంలో గొర్రెల సుబ్రమణ్యం నిర్మించిన చిత్రం అల్లుడు అదుర్స్. యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నభానటేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. నేచురల్ స్టార్ నాని, సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్, దర్శకుడు సంతోష్ శ్రీనివాస్, సప్తగిరి, ఎడిటర్ తమ్మిరాజు, సమర్పకుడు రమేష్ కుమార్ గంజి, బెల్లంకొండ సురేష్, చిత్ర నిర్మాత గొర్రెల సుబ్రమణ్యం పాల్గొన్నారు. ముఖ్యఅతిధిగా విచ్చేసిన వినాయక్, నాని "అల్లుడు అదుర్స్" ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ..
రైడ్ మూవీలో బలవంతంగా
నా కెరీర్ బిగినింగ్‌లో నా మాట వినలేదు. అప్పుడు ఆయనకు బాగా కలిసి వచ్చింది. రైడ్ సినిమా చేయనని ఆయన ఆఫీస్‌కు వెళ్తే బలవంతంగా నాతో ఆ సినిమా తీశారు. నాకు కూడా ఆ సినిమా బాగా కలిసి వచ్చింది అని రైడ్ సినిమాకు ముందు అనుభవాలను పంచుకొన్నారు.
షూటింగులో ఉంటానని చెబితే వినకుండా
అల్లుడు అదుర్స్ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ చేయమని బెల్లంకొండ సురేష్ అడిగారు. ప్రసాద్ ల్యాబ్స్‌లో షూటింగులో ఉంటానని చెప్పాను. అయితే ఆయన వినకుండా ప్రసాద్ లాబ్స్లోనే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ పెట్టి నాతో ఆవిష్కరింప చేశారు. ట్రైలర్ చూసిన తర్వాత ఇది కూడా కలిసి వస్తుందనిపిస్తున్నది అని నాని అన్నారు.
బెల్లంకొండ శ్రీను చాలా చిన్నోడు
రైడ్ సినిమా చేసిన సమయంలో బెల్లంకొండ శ్రీనివాస్ చాలా చిన్న పిల్లాడు. షూటింగులో డ్యాన్సులు, ఎక్సర్సైజులు చేస్తూ ఉండేవాడు. వినాయక్ లాంటి పెద్ద డైరెక్టర్ చేతుల మీదుగా హీరోగా లాంఛ్ అయ్యారు. వరుస విజయాలతో దూసుకెళ్లున్నారు. త్వరలోనే హిందీలో కూడా లాంచ్ చేయబోతున్నట్టు తెలిసింది. అన్ని రకాలుగా శ్రీను సక్సెస్ కావాలని కోరుకొంటున్నాను అని నాని తెలిపారు.
10 నెలలుగా థియేటర్లు వెలవెల
అల్లుడు అదుర్స్ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్‌కు, చిత్ర యూనిట్, నిర్మాతలకు మంచి సక్సెస్ లభించాలి. సంక్రాంతి పండుగకు సినీ పరిశ్రమకు మంచి లాభాలు తీసుకురావాలి. 10 నెలలుగా ప్రేక్షకులు థియేటర్లకు దూరమయ్యారు. ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందని ఆశిస్తున్నాను అని నాని అన్నారు.