పూజా హెగ్డేతో నాని నెక్స్ట్ లెవెల్ రొమాన్స్.. ఆ సినిమా అర్జున్ రెడ్డిని మించబోతుందట?
నాచురల్ స్టార్ నాని గురించి ఆయన సినిమాల గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన నటన కనబరుస్తూ.. పక్కింటి కుర్రాడిలా కనిపిస్తుంటాడు. ముఖ్యంగా అభిమానుల అంచనాలకు ఏమాత్రం దూరంగా ఉండకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించడంలో ఎప్పుడూ ముందుంటాడు ఈ హీరో. అయితే ప్రస్తుతం ఈయన హీరోగా రాబోతున్న తాజా చిత్రం హాయ్ నాన్న. రేపే విడుదల కాబోతున్న ఈ చిత్రంపై భారీ స్థాయిలో బజ్ క్రియేట్ అయింది. తండ్రీ, కూతుళ్ల ప్రేమ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ చిత్రంలో మృణాల్ థాకూర్ కథానాయికాగ కనిపించింది.
ఈ సినిమా ఇంకా విడుదల కూడా కాకముందే నాని మరికొన్ని సినిమాలను లైన్ లో పెట్టాడు. మరో రెండేళ్ల పాటు ఏమాత్రం ఖాళీగా ఉండకుండా ప్లాన్ చేసుకున్నాడు. దాదాపుగా ఐదు చిత్రాలను లైన్ లో పెట్టిన ఈయన.. మొదటగా సరిపోదా శనివారంతో ప్రేక్షకుల ముందుకు వస్తాడని అర్థం అవుతుంది. అయితే ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించబోతున్నారు. సగం షూటింగ్ అయిపోయాక ఆగిపోయిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే షూటంగ్ ప్రారంభించుకోబోతుంది. ఇక ఇది కాగానే... తమిళ డైరెక్టర్ సిబి చక్రవర్తితో కలిసి నాని నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు.

అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటికే జరుగుతున్నాయి. అయితే వచ్చే ఏడాది రెండో నెలలో లేదా మూడో నెలలో మొదలు పెట్టబోతున్న ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకోబోతున్నారట. చాలా రోజుల నుంచి సినిమాలు, హిట్లు లేక ఖాళీగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మకు నాని సినిమాలో ఛాన్స్ రావడం గమనార్హం. ఇది మాత్రమే కాదండోయ్.. ఈ సినిమా నుంచి మరో సాలిడ్ అప్ డేట్ కూడా వెలుగులోకి వచ్చింది.
ఈ చిత్రం అర్జున్ రెడ్డిని మించబోతుందని.. అంతేకాకుండా.. నాచురల్ స్టార్ నాని హీరోయిన్ తో ఫుల్లుగా రొమాన్స్ చేయబోతున్నారని తెలుస్తోంది. అర్జున్ రెడ్డి సినిమా ఉన్న స్థాయిలో రొమాన్స్ ఉండబోతుందని టాక్ నడుస్తోంది. ఇందుకు బుట్టబొమ్మ కూడా ఒప్పుకుందట. మరి ఫుల్లుగా రొమాన్స్ చేస్తూ అందరికీ కనిపించబోతున్న ఈ సినిమా అయినా ఫుల్ సక్సెస్ అయి పూజా హెగ్డేకు హిట్టు ఇస్తుందో లేదో చూడాలి మరి.

ఇప్పటికే మహేష్ బాబు హీరోగా వస్తున్న గుంటూరు కారం సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న ఈమెకు ఈసారి నానితో అయినా హిట్ వస్తే బాగుండు అని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. ఎలాంటి హిట్లు లేకపోవడం వల్లే.. కేవలం స్టార్ హీరోలతో మాత్రమే కాకుండా టైర్ 2 హీరోలతో కూడా నటించాలని పూజా హెగ్డే ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. నానితో రాబోతున్న ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా తమిళ భాషలో కూడా తీసుకు వచ్చేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











