Don't Miss!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- News చిలుకూరు బాలాజీ ఆలయానికి గరుడ ప్రసాదం కోసం భక్తుల రష్.. అసలేమిటీ గరుడ ప్రసాదం?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
రేయ్ రేయ్ అల్లరి నరేష్ పేరు మార్చేయ్.. కామెడీ హీరోకు నాని సలహా
కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న అల్లరి నరేష్ గత 8 ఏళ్ళలో విజయం లేకుండా ఎంతగా కష్టపడ్డాడో అందరికి తెలిసిందే. సుడిగాడుతో వచ్చిన 10కోట్ల మార్కెట్ ను ఆ తరువాత కొన్ని సినిమాల వల్ల కోల్పోవాల్సి వచ్చింది. మార్కెట్ సంగతి పక్కన పెడితే ఎలాంటి సినిమా చేసినా కూడా పాజిటివ్ టాక్ ను అందుకోలేకపోయింది. ఇక కామెడీ జానర్ ను పక్కన పెట్టి నాంది సినిమాతో చేసిన సరికొత్త థ్రిల్లర్ జనర్ నరేష్ ను ట్రాక్ లోకి తీసుకొచ్చింది. ఇక సినిమా సక్సెస్ పై హీరో నాని కూడా స్పందించాడు.
నరేష్ పై ప్రశంసలు
ఎలాగైనా ఈ సక్సెస్ ను కంటిన్యూగా అందుకోవాలని నరేష్ కొన్ని విభిన్నమైన కథలను ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నాంది సినిమా సక్సెస్ కావడానికి అసలు కారణం నరేష్ హార్డ్ వర్క్ అనే చెప్పాలి. దర్శకుడు విజయ్ కనకమేడల రాసుకున్న కథకు 100% న్యాయం చేశాడు. ఇక సినిమా ఇండస్ట్రీలో చాలా మంది సినీ ప్రముఖులు నాంది సినిమా చూసి నరేష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
నాని కోసం స్పెషల్ షో
మొత్తానికి హీరో నాని కూడా ఈ సినిమాను స్పెషల్ షో వేయించుకొని మరి వీక్షించాడు. నాని, నరేష్ ఎంత మంచి స్నేహితులో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పిల్ల జమిందార్ సినిమా నుంచి నాని సినిమాలను లైక్ చేస్తూ వస్తున్న నరేష్ ఆ తరువాత పరిచయం పెంచుకొని అతి తక్కువ కాలంలోనే ప్రాణ స్నేహితులయ్యారు.
ఎలాంటి సినిమా చేసినా కూడా
ఇక నాని మొదటి నుంచి కూడా నరేష్ సినిమాలకు సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. ఎలాంటి సినిమా చేసినా కూడా ప్రమోషన్ లో హెల్ప్ చేస్తున్నాడు. ఈ ఇద్దరు ఒకరి సినిమాల గురించి మరొకరు నిత్యం చర్చించుకుంటూనే ఉంటారట. ఇక నాంది సినిమాను రీసెంట్ గా చూసిన నాని అతనిపై విభిన్నంగా కామెంట్ చేశాడు.
పేరు మార్చేయ్ ఇంక
రేయ్ రేయ్ రేయ్.. అల్లరి నరేష్ పేరు మార్చేయ్ ఇంక. అల్లరి గతం. భవిష్యత్తుకు ఇది నాంది. చాలా హ్యాపీగా ఉంది రా. నీలోని కళాకారుడిని మరింతగా వెలికితీస్తావని ఆశిస్తున్నాను.. ఇది అద్భుతమైన నటన.. అంటూ నాని తన స్నేహితుడి సినిమాపై చాలా పాజిటివ్ గా కామెంట్ చేశారు.
నరేష్ ఫ్రెండ్లి రిప్లై..
ఇక నాని చేసిన కామెంట్ కు.. నరేష్ థాంక్యు బాబాయ్ అంటూ ఫ్రెండ్లిగా రిప్లై ఇచ్చాడు. ఇక నాంది సినిమా సక్సెస్ మీట్ లోనే దిల్ రాజు నరేష్ కు బంపర్ ఆఫర్ ఇచ్చేశారు. తప్పకుండా నరేష్ తో ఒక సినిమా చేయడానికి రెడీ అంటూ మంచి కథ ఉంటే తీసుకురావాలని కూడా చెప్పారు. దీంతో అల్లరి నరేష్ ఎంతగానో సంతోషించాడు. నరేష్ చాలా కాలం నుంచి దిల్ రాజుతో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఇక ఆ కల మొత్తానికి నిజం కాబోతోంది.