అలాంటి హీరోలు ఉంటారా? ఎవడన్నాడు..ఘాటుగా స్పందించిన నాని
తెలుగు సినిమాల్లో హీరోలు ఎంతోమంది ఉన్నారు. కానీ వీరిని స్టార్స్ , మిడియం రేంజ్, అప్ కమింగ్ హీరోలుగా విభజించారు కొందరు. ఎవరు ఎప్పుడు , ఎందుకు ఇలాంటి ముద్ర వేశారో కానీ హీరోలకు ఆ ట్యాగ్ బ్రాండ్‌లా మారిపోయింది. దీని వల్ల కొందరు హీరోలకు స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేసే ఛాన్స్‌లు రాకపోగా, మార్కెట్ కూడా పెరగడం లేదు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లో టైర్-1, టైర్-2 హీరోలంటూ జరుగుతున్న ప్రచారంపై నేచురల్ స్టార్ నాని హాట్ కామెంట్స్ చేశారు.
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా హేమా హేమీలున్న టాలీవుడ్‌లో హీరోగా నిలదొక్కుకుని నేచురల్ స్టార్‌గా అభిమానులతో పిలిపించుకుంటున్నారు నాని. కష్టపడితే ఎంతటి సామాన్యుడైన ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని నాని ప్రూవ్ చేశారు. ఓ వైపు హీరోగా వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూనే వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నిర్మాతగానూ మారారు. యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా నాని పలు సందర్భాల్లో చెప్పారు. కంటెంట్‌లో కొత్తదనం ఉంటే చాలు తన బడ్జెట్ పరిధిలో సినిమాలకు ఓకే చెబుతున్నారు నేచురల్ స్టార్.

తొలుత లవర్‌బాయ్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్స్ చేసిన నాని.. తర్వాత మాస్ ఇమేజ్ కోసం చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. దసరాలో పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటిన నాని.. అదే జోష్ కంటిన్యూ చేస్తున్నారు. వరుసగా మాస్, యాక్షన్ సినిమాలనే ఆయన లైన్‌లో పెడుతున్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3, దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో మరో మూవీని అనౌన్స్ చేసిన నాని.. ఈసారి ఏకంగా సాహో, ఓజీలను తెరకెక్కించిన సుజీత్‌తో జత కడుతున్నారు.
ప్రస్తుతం నాని నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా, ఎస్‌జే సూర్య విలన్‌గా నటించిన ఈ సినిమా ఆగస్ట్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్టార్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించగా.. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. ఈ మూవీ పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
ఈ నేపథ్యంలో సరిపోదా శనివారం చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ నిర్వహించింది. ఈ సినిమా హిట్‌తో మీరు టైర్ 1 హీరో అయిపోయినట్లేనా అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు నాని తనదైనశైలిలో ఆన్సర్ ఇచ్చారు. టైర్-1, టైర్-2 హీరోలు వంటి పేర్లు పెట్టోద్దని, ఎవరు మొదలుపెట్టారో, ఎందుకు మొదలుపెట్టారో కానీ.. మీరు క్రియేట్ చేశారు అదే ముందుకు వెళ్తోందని నాని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఈ ఇష్యూతో సంబంధం లేదని, ఈ టైర్ల గోల నుంచి తనను వదిలేయాలని నాని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం నేచురల్ స్టార్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నాని అభిమానులు ఆయనకు మద్ధతుగా కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











