Hi Nanna: గుండెను బరువెక్కించేలా 'హాయ్ నాన్న'... నాని మృణాల్ లవ్ స్టోరీలో శృతి హాసన్?
నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం హాయ్ నాన్న. ఇక ఈ సినిమా ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాకు కొత్త దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీ డిసెంబర్ 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ఆ ట్రైలర్ చూస్తే.. గుండెల్ని బరువు ఎక్కించేలా ఉంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
దసరా సినిమాతో పాన్ ఇండియా లెవెల్ హిట్ కొట్టిన నాని.. తాజాగా హాయ్ నాన్న అంటూ రాబోతున్నాడు. ఇక ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ కాబోతుంది. మొదటి సారిగా ఈ సినిమాలో నాని సరసన సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు కొత్త దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వం వహించగా... ఖుషి సంగీతం దర్శకుడు హేషమ్ అబ్దుల్ సంగీతం అందించారు.

హాయ్ నాన్న సినిమాను వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చెరుకూరి వెంకట మోహన్ (సీవీయమ్), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా డెసెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ప్రచారం స్టార్ట్ చేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ నిడివి 2 నిమిషాల 41 సెకన్లుగా ఉంది.
ఇక ఈ మూవీ కూతురిపై ప్రేమ, కుటుంబం నేపథ్యంలో తెరకెక్కిందని ట్రైలర్ చూస్తే అర్దం అవుతుంది. ఇక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాగా 'హాయ్ నాన్న' రాబోతుంది. ఈ సినిమాలో నాని కూతురి పాత్రలో బేబీ కియారా నటించింది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు ఊపేస్తున్నాయి. ఖుషి సినిమాకు సంగీతం అందించిన హేషమ్.. ఈ సినిమాకు కూడా అదిరిపోయే ట్రాక్స్ అందించాడు. ఇక తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ కు కూడా అద్భుతమైన బీజీఎం అందించాడు హేషమ్.
ట్రైలర్ లో నాని, తన కూతురు జీవితం గడిపేస్తుండగా వారి లైఫ్ లోకి మృణాల్ వచ్చినట్టు తెలుస్తోంది. విరాజ్ పాత్రలో నాని, యష్న క్యారెక్టర్‌లో మృణాల్, నాని కూతురు మహీ పాత్రలో నటిస్తున్నారు. కూతురికి నాని కథ చెబుతున్నట్టుగా ట్రైలర్ మొదలు అవుతుంది. ఇక బేబీ కియారా తన అమ్మ కథ చెప్పాలని అడుగుతుంది. నాని దాటవేస్తూ ఉంటాడు. ఓ ప్రమాదం నుంచి మహీని కాపాడి మృణాల్ ఠాకూర్ ఆమెకు దగ్గరైందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.
అయితే చివరికి అమ్మ కథ చెబుతానని తన కూతురితో నాని మొదలు పెట్టి తన లవ్ స్టోరీ, పెళ్లి తర్వాత గొడవలు పడి భార్యతో విడిపోయినట్టుగా కనిపిస్తుంది. నా ప్రేమ సరిపోవడం లేదా మహీ అని ఎమోషనల్‍గా నాని డైలాగ్ చెబితే, ఇంకా చెప్పొద్దు ఇంటికి వెళ్లిపోదాం నాన్న అని కియారా అతడిని హత్తుకుంటుంది. ఈ సీన్ గుండెల్ని బరువెక్కించాలా ఉంటుంది. ఇక ఈ సినిమాలో నాని భార్యగా శృతిహాసన్ కనిపిస్తుంది. ఆమె ఏం అయింది.. మృణాల్ ఎలా ఎంటర్ అయింది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


Click it and Unblock the Notifications











