2.0 గురించి భాదపడుతూ ట్వీట్ చేసిన నాని!
సినీ అభిమానులంతా 2.0 ఫీవర్ తో ఊగిపోతున్నారు. ఎక్కడ చూసిన రజనీకాంత్ అభిమానుల సందడి నెలకొని ఉంది. థియేటర్స్ వద్ద అయితే ఫ్యాన్స్ అంబరాన్ని అంటే సంబరాలు చేస్తున్నారు. సెలెబ్రిటీలు కూడా 2.0 చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా మంది సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కానీ నేచురల్ స్టార్ నాని మాత్రం భిన్నంగా స్పందించాడు. 2.0 చిత్రం విడుదలవుతుంటే పాపం నాని బాగా దిగులుతో ఉన్నట్లు తెలుస్తోంది. తలైవర్ రజనీకాంత్ బాక్సాఫీస్ వద్దకు వచ్చాడు. కానీ నేను మాత్రం షూటింగ్ స్పాట్ కి వచ్చా. ఫస్ట్ డే ఫస్ట్ షో మిస్ అవుతున్నా అంటూ నాని ట్వీట్ చేశాడు.

నాని ప్రస్తుతం జెర్సీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బిజీ షెడ్యూల్ కారణంగా సూపర్ స్టార్ సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో చూడలేకపోవడంతో నాని ఇలా ట్వీట్ చేశాడు. ఇప్పటికే రాజమౌళి, సాయిధరమ్ తేజ్, అనిరుద్, కార్తీ లాంటి సెలెబ్రిటీలంతా 2.0 చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.


Click it and Unblock the Notifications











