Masooda Teaser వెన్నులో చలిపుట్టించేలా.. నాని చేతుల మీదుగా టీజర్ ఆవిష్కరణ

మ‌ళ్లీ రావా చిత్రంతో గౌతమ్ తిన్ననూరిని, ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ మూవీతో స్వరూప్‌ను దర్శకుడిగా పరిచేయం చేసిన అభిరుచి గల నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా తాజాగా నిర్మిస్తున్న చిత్రం మసూద. ఈ సినిమా ద్వారా సాయికిరణ్ అనే కొత్త డైరెక్టర్‌ను తెలుగు సినిమాకు పరిచయం చేస్తున్నారు.ఈ చిత్రంలో జార్జిరెడ్డి మూవీతో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకొన్న తీరువీర్ ప్రధాన పాత్రలో..గంగోత్రి చిత్రంలో బాలనటిగా మెప్పించిన కావ్య కల్యాణ్ రామ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సీనియర నటి సంగీత కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఆగస్టు 02వ తేదీ మంగళవారం నేచురల్ స్టార్ నాని చేతులు మీదుగా ఆవిష్కృతమైంది.

మసుదా టీజర్ విషయానికి వస్తే.. హారర్, థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కింది. తీరువీర్, సంగీత మెట్లపై కూర్చొని ఏదో వ్యాధిన పడిన అమ్మాయి గురించి దీర్ఘంగా ఆలోచిస్తూ కనిపించారు. అమ్మాయి పావురాలు ఆహారం వేస్తూ తనకు తానుగా ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ట్యాబ్లెట్లతో నయం కాదనిపిస్తుంది. పీర్ బాబాకు చూపిస్తే ఎలా ఉంటుందని సంగీత అడిగితే.. ఇప్పుడైతే బాగుంది కదా అని తీరువీర్ అన్నాడు. అయితే.. అప్పుడప్పుడు ఆమె చేసే పనులు చూస్తే.. ఎవరైనా పీర్ బాబాకు చూపిస్తే బాగుండనిపిస్తుంది అని చెప్పింది.

Natural Star Nani unveils Tiruveer and Rahul Yadav Nakkas Masooda teaser

ఇక టీజర్‌లో ఎవరో ఒక అమ్మాయి జుట్టు విరబోసుకొని నేలపై కూర్చొన్నది అంటూ తిరువీర్‌ను పట్టుకొని గజగజ వణికిపోయింది. ఏవేవో ఊహించని సంఘటనలతో పాత్రధారులు వణికిపోతూ కనిపించారు. ప్రతీ ఫ్రేమ్‌లో భయానక దృశ్యాలు చూస్తే.. హారర్ సినిమాలను అభిమానించే వారికి సినిమాపై నిజంగానే అంచనాలు పెంచాయి. మసూద సినిమాను ఎప్పుడెప్పుడూ చూద్దామా అనే ఆసక్తిని టీజర్ కలిగించడంలో సఫలమైంది.

టీజర్ చివర్లలో సంగీత దీనంగా మాట్లాడుతూ.. సైన్స్ టీచర్‌గా ఉండి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందని అనుకొంటున్నావా అని అంటే.. నజియా బాగు కావడమే మనకు ముఖ్యం. మెడిసిన్ అయితే మెడిసన్.. పీర్ బాబా అయితే పీర్ బాబా.. అదే మనకు ముఖ్యం అని తీరువీర్ చెప్పారు. దీంతో సైన్స్, దైవానికి మధ్య జరిగిన సంఘర్షణగా టీజర్ చెప్పకనే చెప్పింది. తిరువీర్, సంగీత కొత్తగా, విభిన్నంగా కనిపించారు.

Natural Star Nani unveils Tiruveer and Rahul Yadav Nakkas Masooda teaser

మసుదా టీజర్ రిలీజ్ చేసిన తర్వాత నాని మాట్లాడుతూ.. టీజర్ ప్రామిసింగ్‌గా ఉంది. ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి ఈ చిత్రంలో చేసినట్లుగా అనిపిస్తుంది. టీజర్ చూస్తుంటే.. ఎప్పుడెప్పుడు సినిమాని చూద్దామా అని అనిపిస్తుంది. ఈ సినిమా విజయవంతం కావాలి అని చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

టీజర్ విడుదల సందర్భంగా నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా మాట్లాడుతూ.. ముందుగా మా చిత్ర టీజర్‌ను విడుదల చేసిన న్యాచురల్ స్టార్ నాని గారికి మా టీమ్ తరపున ధన్యవాదాలు. ఆయనకు టీజర్ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా సంస్థలో వస్తున్న ఈ మూడో చిత్రం కూడా ప్రేక్షకులను చక్కగా ఎంటర్‌టైన్ చేస్తుంది. ఈ చిత్రంతో సాయికిరణ్ అనే దర్శకుడిని పరిచయం చేస్తున్నాం. సాయికిరణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించి తీరు.. ప్రేక్షకులందరినీ మెప్పిస్తుంది. ఈ చిత్రంలో నటించిన నటీనటులకు, అలాగే పనిచేసిన సాంకేతిక నిపుణులకు, సహకరించిన అందరికీ ధన్యవాదాలు. త్వరలోనే చిత్ర ట్రైలర్‌, అలాగే మూవీ విడుదలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తాం అని అన్నారు.

నటీనటులు: తిరువీర్, కావ్య కల్యాణ్ రామ్, సంగీత, శుభలేఖ సుధాకర్, అఖిల రామ్, బాంధవి శ్రీధర్, సత్యం రాజేష్, సత్య ప్రకాశ్, సూర్యారావు, సురభి ప్రభావతి, కృష్ణ తేజ తదితరులు
రచన, దర్శకత్వం: సాయికిరణ్
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా
ఆర్ట్: క్రాంతి ప్రియం
కెమెరా: నగేష్ బనెల్
స్టంట్స్: రామ్ కిషన్ అండ్ స్టంట్ జాషువా
సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి
ఎడిటింగ్: జెశ్విన్ ప్రభు
పీఆర్వో: బి. వీరబాబు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X