న్యాచురల్ స్టార్ న్యూ లుక్ వైరల్.. అసలు నాని చేతికి ఏమైంది?

The Paradise: న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అసిస్టెండ్ డైరెక్టర్ గా సినీ ప్రయాణం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వెండితెరకు హీరోగా పరిచయం అయ్యాడు. తన సహజ సిద్ధమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని 'ది ప్యారడైజ్' సినిమాతో మరో భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే.. ఇటీవల నాని సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫొటోలు అభిమానుల్లో ఆందోళనను కలిగించాయి. నాని ఎడమ చేతి మోచేతికి బ్యాండేజ్ కట్టుకుని కనిపించడంతో అసలు ఏమైంది? షూటింగ్‌లో గాయపడ్డారా? అనేది చర్చనీయంగా మారింది.

నాని వరుస సినిమాలతో బిబీబిజీగా ఉన్నారు. ఆయన సినిమాలను పరిశీలిస్తే యాక్షన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉన్న కథలనే ఎంచుకుంటున్నారు. ఈ ఏడాది విడుదలైన 'హిట్ 3'లో కూడా ఆయన యాక్షన్ సన్నివేశాల్లో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం తెరకెక్కుతున్న 'ది ప్యారడైజ్' కూడా భారీ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఈ సినిమాలో నాని గతంలో ఎప్పుడూ కనిపించని కొత్త అవతారంలో కనిపించనున్నారని ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ద్వారా స్పష్టమవుతోంది.

Natural Star Nani s Bandaged Arm Goes Viral Did He Get Injured During The Paradise Shoot

'దసరా' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నాని కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో 'ది ప్యారడైజ్'పై అంచనాలు మరింత పెరిగాయి. నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అందిస్తున్న సంగీతం కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన 'ఆయా షేర్' పాటకు మంచి స్పందన రావడంతో సినిమా ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా హీరో నాని తన సోషల్ మీడియా ఖాతాలో కొత్త ఫొటోలను పోస్ట్ చేశారు. అందులో ఆయన లాంగ్ హెయిర్, స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. అయితే.. ఈ ఫోటోల్లో ఎడమ చేతికి బ్యాండేజ్ కూడా స్పష్టంగా కనిపించింది. దీనికి "ఘాయల్ హూ.. ఇస్లియే ఘాతక్ హూ" అంటూ 'ధురంధర్' సినిమాలోని డైలాగ్‌ను క్యాప్షన్‌గా జత చేశారు. ఈ ఒక్క క్యాప్షన్‌తోనే అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. అయితే.. గాయం ఎలా జరిగింది? అది షూటింగ్‌లో జరిగిందా? మరెదైనా ప్రమాదమా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

నాని మాత్రం తన గాయం గురించి ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అనే విషయాలపై కూడా స్పష్టత లేదు. అయినా.. సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. కొందరు అభిమానులు యాక్షన్ సన్నివేశాల షూటింగ్ సమయంలో ఈ గాయం జరిగి ఉండొచ్చని భావిస్తుండగా, మరికొందరు మాత్రం చిన్న గాయమే అయి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. అధికారికంగా మూవీ మేకర్స్ నుంచి కూడా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు.

Read more about: nani srikanth odela The Paradise
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X