For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వంశీ శేఖర్ చీటింగ్ చేశారు.. నాట్యం సినిమాపై విషం చిమ్మించారు.. డైరెక్టర్ రేవంత్ తీవ్ర ఆరోపణలు

  |

  టాలీవుడ్‌లో ఇటీవల రిలీజై సంప్రదాయ ప్రేక్షకులను ఆకట్టుకొన్న నాట్యం సినిమా విషయంలో వివాదం కొనసాగుతున్నది. ఆ సినిమా డైరెక్టర్ రేవంత్, నిర్మాత, హీరోయిన్ సంధ్యారాజు తమ సినిమాకు ప్రమోషన్ విషయంలో అన్యాయం చేశారనే ఆరోపణలతో సినీ పెద్దలను కలిసి ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటి వరకు మా అధ్యక్షుడు విష్ణు మంచు, సినీ నిర్మాతల మండలి కలిసి ఫిర్యాదు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్‌ను కూడా కలిసి పీఆర్వోలు వంశీ, శేఖర్ ఏ విధంగా చీటింగ్ చేశారనే విషయాన్ని కూడా చెప్పుకొన్నట్టు సమాచారం. ఇటీవల మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి సినిమా రిపోర్టర్లను సంధ్యారాజు, రేవంత్ కలువడం ఈ వివాదం మరింత జఠిలంగా మారింది. ఈ సందర్భంగా దర్శకుడు రేవంత్ ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

  నాట్యం సినిమాకు వంశీ, శేఖర్‌ను పీఆర్వోలుగా పెట్టుకొన్నాం. తొలుత ఉచితంగా పబ్లిసిటీ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత వారి గొంతెమ్మ కోరికలు ఎక్కువ అయ్యాయి. ప్రమోషన్ పేరుతో ఏదో కారణాలు చెబుతూ మా నుంచి డబ్బు పిండటం మొదలుపెట్టారు. అయితే మాకు అనుమానాలు రావడంతో మేమే స్వయంగా మీడియాను కలుస్తామని చెప్పాం. అయితే మీడియాను కలిపించడం కుదరదు. వారిని కలిస్తే అంతా గందరగోళం ఏర్పడుతుంది. వారి అరుపులతో సినిమా ప్రమోషన్ జరుగుతుందని భారీగా డబ్బులు అందజేశాం అని వంశీ, శేఖర్ తప్పించుకొనే ప్రయత్నం చేశారు అని రేవంత్ ఆరోపించారు.

  Natyam Director Revanth Korukonda serious allegations on Leading PROs Vamsi Shekhar

  మేము గత మూడు సంవత్సరాలుగా సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఆ విషయాన్ని మీడియాకు చెప్పి సహకారం తీసుకొంటామని వంశీ, శేఖర్‌కు విన్నవించుకొన్నాం. అయితే మా మాటలను పెడచెవిన పెట్టి మమల్నే సినిమా రిలీజ్‌కు ముందు టార్గెట్ చేశారు. మీడియాను కలువనీయకుండా చేశారు. మేము పట్టుపట్టడంతో టెలివిజన్, ప్రింట్ మీడియాను కలిసేలా చేశాం. వెబ్‌సైట్లను కల్పించడానికి నిరాకరించారు. అందుకు మేము అభ్యంతరం చెబితే.. వాళ్లు రారు.. వాళ్లను కలిపించం. మీకు ఇష్టం ఉంటే ఉండండి.. మేము చెప్పినట్టు వినిపించాలని గొడవ పడ్డారు. సినిమా రిలీజ్‌కు కొన్ని వెబ్‌సైటలో మాకు వ్యతిరేకంగా రాయించారు. మా వద్ద డబ్బులు తీసుకొని మా కెరీర్లను నాశనం చేశారు అని రేవంత్ ఆరోపించారు.

  వంశీ, శేఖర్ చేసిన నిర్వాకంపై నాతోపాటు మా నిర్మాత, హీరోయిన్ సంధ్యారాజు, చిత్ర యూనిట్ తీవ్రంగా హార్ట్ అయ్యాం. ఈ విషయాన్ని సినీ పెద్దలకు చెప్పి న్యాయం చేయాలని కోరుకొంటున్నాం అని అన్నారు. ఇలాంటి వ్యక్తుల వల్ల చిన్న నిర్మాతలు, సినీ పరిశ్రమలోకి కొత్తగా రావాలనుకొంటున్న దర్శకులు గతంలో ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారనే విషయం మా దృష్టికి వచ్చింది. ఎంతో కష్టపడి సినిమాను ప్రాణంగా ప్రేమించి కెరీర్‌గా మలుచుకోవాలనే వారికి అన్యాయం జరుగుతుంది. ఇలాంటి అన్యాయాలు భవిష్యత్‌లో జరగకుండా చూడాలన్నదే మా ప్రయత్నం. ఈ పీఆర్వోల నిజస్వరూపం చెప్పాలన్నదే మా ప్రయత్నం. ఆ దిశగా సంధ్యారాజు, నేను ప్రయత్నిస్తున్నాం అని రేవంత్ తన ఆవేదనను వ్యక్తం చేశారు.

  అయితే రేవంత్ ఆరోపణలను తమ సన్నిహితులు, సినీ ప్రముఖుల వద్ద వంశీ, శేఖర్ ఖండిస్తున్నట్టు సమాచారం. రేవంత్ ఆరోపణలపై వారిద్దరూ ఎలాంటి సమాధానం ఇస్తారో వేచి చూడాల్సిందే.

  English summary
  Natyam director Revanth Korukonda serious allegations on Leading PRO's Vamsi Shekhar. He said, They Cheated us, Inspite of huge money for Promotions, Which they took.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X