బోయపాటి సినిమాలో లక్కీ ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరో.. ఈసారి మరింత క్రూరంగా..
ఈ మధ్య కాలంలో కొంత మంది యువ నటులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన తరువాత కూడా విలన్స్ గా మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. బాహుబలితో రానా ఈ సరికొత్త ట్రెండ్ కి మరింత బూస్ట్ ఇచ్చాడు. జగపతిబాబు, ఆది పినిశెట్టితో పాటు కార్తికేయ కూడా నెగిటివ్ రోల్స్ తో ఆడియెన్స్ కి సరికొత్త థ్రిల్ ఇస్తున్న విషయం తెలిసిందే. అదే తరహాలో నవీన్ చంద్ర కూడా తన నటనతో మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు.
అందాల రాక్షసి సినిమాతో ఒక మంచి కథానాయకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నవీన్ చంద్ర తనదైన శైలిలో హీరోగా సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు నెగిటివ్ రోల్స్ కూడా చేస్తున్నాడు. అరవింద సమేతలో అతను చేసిన పాత్ర బాగానే క్లిక్కయ్యింది. ఇక ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయబోతున్న కొత్త సినిమాలో కూడా నవీన్ చంద్ర ఒక నెగిటిక్ రోల్ చేయబోతున్నాడట.

బాలకృష్ణ - బోయపాటి దర్శకత్వంలో రానున్న మోనార్క్ సినిమాలో అతని పాత్ర చాలా కీలకమట. ఓ విధంగా అరవింద సమేత సినిమాలో కంటే కూడా ఇందులో చేసే పాత్ర అతి క్రూరంగా ఉంటుందని టాక్ వస్తోంది. నవీన్ నటుడిగా మరో స్థాయికి చేరుకోవడానికి ఆ పాత్ర చాలా బాగా ఉపయోగపడుతుందని సమాచారం. కేవలం విలన్ రోల్స్ అనే కాకుండా నవీన్ కథానాయకుడిగా కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











