విజయ్‌ను హగ్ చేసుకొని ఎమోషనల్ అయిన నవీన్ పొలిశెట్టి.. దర్శకుడి ముందు కన్నీళ్లు!

సక్సెస్ అనేది అంత ఈజీగా రాదని సినిమా ఇండస్ట్రీలో కొంతమంది యువ హీరోలను, దర్శకులను చూస్తే అర్ధమవుతుంది. బ్యాక్ గ్రౌండ్ లేకుండా అవకాశాలు రావాలంటే చాలా కష్టమైన పని. ఎన్నో ఏళ్ల ఓపిక ఉండాలి. విజయ్ దేవరకొండ ఎన్నేళ్ళు కష్టపడ్డాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక మళ్ళీ ఇన్నాళ్లకు నవీన్ పొలిశెట్టి అనే అదే తరహాలో కష్టపడి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. ఇటీవల నవీన్ చాలా ఎమోషనల్ అయ్యాడు.

శాకుంతలగా సమంత అక్కినేని.. గుణశేఖర్ దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్ ప్రారంభం (ఫొటోలు)

మూడు రోజుల్లోనే ప్రాఫిట్స్ లోకి..

మూడు రోజుల్లోనే ప్రాఫిట్స్ లోకి..

వైజయంతి వారి స్వప్న సినిమాస్ లో వచ్చిన జాతిరత్నాలు సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఈ సినిమా వినయంతో నవీన్ స్థాయి మరో లెవెల్ కు వెళ్లింది. సినిమా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ వసూళ్లను అందుకుంటోంది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఫినిష్ చేసి ప్రాఫిట్ లోకి వచ్చేసింది.

సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసుకొని..

సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసుకొని..

నవీన్ పొలిశెట్టి సక్సెస్ కావడానికి సమయం చాలానే పట్టింది. లండన్ లో మంచి సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసుకొని మరి యాక్టింగ్ పై ప్రేమతో అవకాశాల కోసం ఆఫీస్ ల చుట్టూ తిరిగాడు. బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా ఆడిషన్స్ ఎక్కడ జరిగినా వెళుతూ వచ్చాడు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నట్లు పలు ఇంటర్వ్యూలో చెప్పాడు.

శశి ప్రీరిలీజ్ ఈవెంట్: రానా దగ్గుబాటి, నాగ శౌర్య , సందీప్ కిషన్ హాజరు (ఫొటోలు)

ఆ పాత్రలతో అద్భుతమైన క్రేజ్

ఆ పాత్రలతో అద్భుతమైన క్రేజ్

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో ఒక నెగిటివ్ పాత్రలో కనిపించిన నవీన్ ఆ తరువాత మహేష్ బాబు 1 నేనొక్కడినే సినిమాలో కూడా స్పెషల్ పాత్రలో కనిపించాడు. ఆ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు అందించింది. అనంతరం బాలీవుడ్ లో దంగల్ డైరెక్టర్ నితీష్ తెరకెక్కించిన చిచోరే సినిమాలో యాసిడ్ పాత్రతో అద్భుతమైన క్రేజ్ అందుకున్నాడు.

నాగ్ అశ్విన్ ముందు కన్నీళ్లు

నాగ్ అశ్విన్ ముందు కన్నీళ్లు

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంది. ఇక జాతిరత్నాలు సినిమా మరో లెవెల్ కు తీసుకెళ్లింది. దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా మారి టీమ్ ను రెడీ చేశారు. సినిమాలో నవీన్ సెలెక్ట్ అవ్వడానికి ప్రధాన కారణం నాగ్ అశ్విన్. జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ చాలా మందిని అనుకున్నప్పటికి నాగ్ అశ్విన్ సలహా మేరకు నవీన్ ను ఫిక్స్ చేశాడు. అందుకే అతన్ని పట్టుకొని కొన్ని నిమిషాల పాటు నవీన్ ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టాడు.

మహేష్ బాబు థియేటర్ లో ముగ్గురు జాతిరత్నాలు సందడి: రచ్చరచ్చ చేశారు (ఫొటోలు)

నవీన్ సక్సెస్ లో విజయ్ పాత్ర..

నవీన్ సక్సెస్ లో విజయ్ పాత్ర..

రీసెంట్ గా విజయ దేవరకొండకు కూడా స్పెషల్ షోను వేయగా సినిమా చూసిన తరువాత పాజిటివ్ గా కామెంట్ చేశాడు. విజయ్ ను చూసి నవీన్ కొంత ఎమోషనల్ అయ్యాడు. గతంలో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ప్రమోషన్ లో కూడా రౌడి స్టార్ నవీన్ కు సహాయం చేశారు. జాతిరత్నాలు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన విషయం తెలిసిందే. ఇక సినిమాలో గెస్ట్ రోల్ చేశాడు. అందుకే ఈ సక్సెస్ ను నవీన్ ఎమోషనల్ అవుతూ ఎంజాయ్ చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X