Just In
- 3 min ago
ఎన్టీఆర్ కారణంగా అల్లు అర్జున్, రాజమౌళి సినిమాలపై ప్రభావం.. మధ్యలో మహేష్ కూడా..
- 34 min ago
పండగలా దిగివచ్చి అభిమానులకు కిక్కిచ్చిన ప్రభాస్.. రాధేశ్యామ్ ఉగాది గిఫ్ట్
- 9 hrs ago
దిల్ రాజుకు కరోనావైరస్ పాజిటివ్.. వకీల్ సాబ్‌ను వెంటాడుతున్న కోవిడ్ 19
- 10 hrs ago
కొత్త సినిమాపై అప్డేట్ ఇచ్చిన బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్ధక్
Don't Miss!
- News
Sputnik V వినియోగానికి డీసీజీఐ గ్రీన్‌సిగ్నల్: డాక్టర్ రెడ్డీస్: ఆ లిస్ట్‌లో 60వ దేశంగా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : మీన రాశి వారు అనవసరమైన ఖర్చులు నియంత్రిస్తారు...!
- Sports
RR vs PBKS: సంజూ శాంసన్ సెంచరీ పోరాటం వృథా.. పంజాబ్ థ్రిల్లింగ్ విక్టరీ.!
- Finance
Gold prices today: తగ్గిన బంగారం, వెండి ధరలు: ఐనా ఆ మార్కుకు పైనే
- Automobiles
నైట్ కర్ఫ్యూ; ఒక్కరోజులో 68 వాహనాల స్వాధీనం.. ఎక్కడో తెలుసా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విజయ్ను హగ్ చేసుకొని ఎమోషనల్ అయిన నవీన్ పొలిశెట్టి.. దర్శకుడి ముందు కన్నీళ్లు!
సక్సెస్ అనేది అంత ఈజీగా రాదని సినిమా ఇండస్ట్రీలో కొంతమంది యువ హీరోలను, దర్శకులను చూస్తే అర్ధమవుతుంది. బ్యాక్ గ్రౌండ్ లేకుండా అవకాశాలు రావాలంటే చాలా కష్టమైన పని. ఎన్నో ఏళ్ల ఓపిక ఉండాలి. విజయ్ దేవరకొండ ఎన్నేళ్ళు కష్టపడ్డాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక మళ్ళీ ఇన్నాళ్లకు నవీన్ పొలిశెట్టి అనే అదే తరహాలో కష్టపడి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. ఇటీవల నవీన్ చాలా ఎమోషనల్ అయ్యాడు.
శాకుంతలగా సమంత అక్కినేని.. గుణశేఖర్ దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్ ప్రారంభం (ఫొటోలు)

మూడు రోజుల్లోనే ప్రాఫిట్స్ లోకి..
వైజయంతి వారి స్వప్న సినిమాస్ లో వచ్చిన జాతిరత్నాలు సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఈ సినిమా వినయంతో నవీన్ స్థాయి మరో లెవెల్ కు వెళ్లింది. సినిమా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ వసూళ్లను అందుకుంటోంది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఫినిష్ చేసి ప్రాఫిట్ లోకి వచ్చేసింది.

సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసుకొని..
నవీన్ పొలిశెట్టి సక్సెస్ కావడానికి సమయం చాలానే పట్టింది. లండన్ లో మంచి సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసుకొని మరి యాక్టింగ్ పై ప్రేమతో అవకాశాల కోసం ఆఫీస్ ల చుట్టూ తిరిగాడు. బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా ఆడిషన్స్ ఎక్కడ జరిగినా వెళుతూ వచ్చాడు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నట్లు పలు ఇంటర్వ్యూలో చెప్పాడు.
శశి ప్రీరిలీజ్ ఈవెంట్: రానా దగ్గుబాటి, నాగ శౌర్య , సందీప్ కిషన్ హాజరు (ఫొటోలు)

ఆ పాత్రలతో అద్భుతమైన క్రేజ్
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో ఒక నెగిటివ్ పాత్రలో కనిపించిన నవీన్ ఆ తరువాత మహేష్ బాబు 1 నేనొక్కడినే సినిమాలో కూడా స్పెషల్ పాత్రలో కనిపించాడు. ఆ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు అందించింది. అనంతరం బాలీవుడ్ లో దంగల్ డైరెక్టర్ నితీష్ తెరకెక్కించిన చిచోరే సినిమాలో యాసిడ్ పాత్రతో అద్భుతమైన క్రేజ్ అందుకున్నాడు.

నాగ్ అశ్విన్ ముందు కన్నీళ్లు
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంది. ఇక జాతిరత్నాలు సినిమా మరో లెవెల్ కు తీసుకెళ్లింది. దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా మారి టీమ్ ను రెడీ చేశారు. సినిమాలో నవీన్ సెలెక్ట్ అవ్వడానికి ప్రధాన కారణం నాగ్ అశ్విన్. జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ చాలా మందిని అనుకున్నప్పటికి నాగ్ అశ్విన్ సలహా మేరకు నవీన్ ను ఫిక్స్ చేశాడు. అందుకే అతన్ని పట్టుకొని కొన్ని నిమిషాల పాటు నవీన్ ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టాడు.
మహేష్ బాబు థియేటర్ లో ముగ్గురు జాతిరత్నాలు సందడి: రచ్చరచ్చ చేశారు (ఫొటోలు)

నవీన్ సక్సెస్ లో విజయ్ పాత్ర..
రీసెంట్ గా విజయ దేవరకొండకు కూడా స్పెషల్ షోను వేయగా సినిమా చూసిన తరువాత పాజిటివ్ గా కామెంట్ చేశాడు. విజయ్ ను చూసి నవీన్ కొంత ఎమోషనల్ అయ్యాడు. గతంలో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ప్రమోషన్ లో కూడా రౌడి స్టార్ నవీన్ కు సహాయం చేశారు. జాతిరత్నాలు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన విషయం తెలిసిందే. ఇక సినిమాలో గెస్ట్ రోల్ చేశాడు. అందుకే ఈ సక్సెస్ ను నవీన్ ఎమోషనల్ అవుతూ ఎంజాయ్ చేస్తున్నాడు.