యాక్సిడెంట్‌లో గాయపడిన నవీన్ పోలిశెట్టి.. తీవ్రగాయాలతో షాకింగ్ పోస్ట్
మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఇటీవల బైక్ ప్రమాదానికి గురైన ఆయన హాస్పిటల్‌లో చికిత్స తీసుకొని ఇప్పుడిప్పుడే కోలుకొంటున్నారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా తర్వాత మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ యువ హీరోకు ప్రమాదం జరగడం అభిమానులను ఆందోళనకు గురి చేసింది. అయితే తాజాగా తన సోషల్ మీడియాలో తన ఆరోగ్యం గురించి అప్ డేట్ ఇస్తూ..
నేను మీరో పర్సనల్ విషయాన్ని ఫేర్ చేసుకొవాలనుకొంటున్నాను. దురదృష్టవశాత్తూ నా చేతికి తీవ్ర గాయాలు అయ్యాయి. కాలికి కూడా గాయమైంది. గాయాల కారణంగా చాలా బాధ పడుతున్నాను. ప్రస్తుతం నాకు ఇది కఠిన పరీక్షగా మారింది. ముఖ్యంగా కెరీర్ పరంగా గ్యాప్ రావడం టెన్షన్‌గా ఉంది. గాయపడిన కారణంగా సినిమాలను మీ ముందుకు తీసుకు రావడంలో ఆలస్యమవుతున్నది అని తన పోస్టులో నవీన్ పోలిశెట్టి అన్నారు.

యాక్సిడెంట్ కారణంగా రోజులు చాలా టఫ్‌గా గడిచాయి. నేను పూర్తిగా రికవరీ అయ్యాను. వైద్యులు, ఫిజియో డాక్టర్ల సహాయంతో గతంలో మాదిరిగా ఎనర్జీని చూపించేందుకు ప్రయత్నిస్తున్నాను. పూర్తిగా కోలుకోవడానికి ఇంకా కొన్ని నెలలు సమయం పడుతుంది. ఇంతకు ముందు కంటే ఇంకా స్ట్రాంగ్‌గా, మరింత ఆరోగ్యకరంగా తిరిగి రావాలని ప్రయత్నిస్తున్నాను అని నవీన్ పోలిశెట్టి తెలిపారు.
గాయం కారణంగా విశ్రాంతి తీసుకొంటున్న సమయంలో నా రాబోయే చిత్రాల స్క్రిప్టులు అద్బుతంగా, మీకు నచ్చే విధంగా వస్తుండటం చాలా హ్యాపీగా ఉంది. నేను పూర్తిగా కోలుకొన్న తర్వాత షూటింగ్ మొదలుపెడుతాను. మీ ప్రేమ, పోత్సాహం త్వరగో కోలుకోనేలా చేస్తున్నది. మీ ప్రేరణ, సపోర్టుకు థ్యాంక్స్ అని ట్వీట్ చేశారు.

అతి త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తాను. స్క్రీన్ మీద కనిపించి మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తాను. మీరు ఎప్పటిలాగే నాపై మీ ప్రేమను కురిపించడానికి సిద్దంగా ఉంటారని అనుకొంటున్నాను అని నవీన్ పోలిశెట్టి అన్నారు.


Click it and Unblock the Notifications











