అప్పుడు దేవరకొండతో.. ఇప్పుడు బెల్లంకొండతో.. కొండలంటే ఇష్టమా? హీరోయిన్‌ను ఆటాడుకొన్న నవీన్ పొలిశెట్టి

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట పతాకంపై ఫార్చ్యూన్ ఫోర్ సినిమా బ్యానర్‌తో కలిసి నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం స్వాతిముత్యం. బెల్లం కొండ గణేష్ ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు. వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంతో లక్ష్మణ్ కే కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు యువ సంచలనం నవీన్ పొలిశెట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ..

పాస్ లేకపోతే లోపలికి రానివ్వలేదు..

పాస్ లేకపోతే లోపలికి రానివ్వలేదు..

స్వాతిముత్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావడం చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఇలా కలుసుకోవడం హ్యాపీగా ఉంది. ఇలాంటి సమయంలో ఎవరైనా ఫోన్ చేస్తే బాగుండు అంటూ జాతిరత్నాలు మాదిరిగా ఫోజు కొడుతూ.. ఫోన్ ఎత్తి.. నేను శిల్ప కళావేదికలో ఉన్నాను. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్టుగా వచ్చాను.

మళ్లీ ఫోన్ చేస్తానని చెప్పాడు. కొద్ది సంవత్సరం క్రితం ఫ్యాన్ ఈవెంట్‌కు వస్తే.. పాస్ లేకపోవడంతో లోపలికి రాకుండా బయటి నుంచే వెళ్లిపోయాను. ఇప్పుడు అదే వేదికపై నన్ను చీఫ్ గెస్ట్‌గా పిలిచేలా తెలుగు ప్రేక్షకులు నాకు గొప్ప గౌరవాన్ని ఇచ్చారు. అందుకు నేను హృదయపూర్వకంగా అందరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని నవీన్ పోలిశెట్టి అన్నారు.

జాతిరత్నాలు హిట్ తర్వాత

జాతిరత్నాలు హిట్ తర్వాత

జాతిరత్నాలు సినిమా హిట్ అయిన తర్వాత మళ్లీ చాలా రోజులకు ఇలా కలుసుకొన్నాం. మిమ్మల్ని కలుసుకోవడానికి అవకాశం రాలేదు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్ తీసిన స్వాతిముత్యం సినిమాతో మిమ్మల్ని కలుసుకొనే అవకాశం లభించింది. స్వాతిముత్యం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అవుతున్న బెల్లంకొండ గణేష్‌కు స్వాగతం పలకండి. బెల్లంకొండ సురేష్ కుమారుడే గణేష్‌. వాళ్ల అన్నయ్యను వాళ్ల నాన్న లాంచ్ చేస్తే.. గణేష్‌ను సితారా లాంచ్ చేస్తున్నది అని నవీన్ పోలిశెట్టి తెలిపారు.

నాకు గణేష్ వైన్స్ అంటే ఇష్టం

నాకు గణేష్ వైన్స్ అంటే ఇష్టం

నాకు గణేష్ పేరు అంటే చాలా ఇష్టం. నాకు గణేష్ చతుర్థి అంటే ఇష్టం. నాకు ఇష్టమైన షాప్.. గణేష్ వైన్. అక్టోబర్ 2 తేదీ కావడంతో నిన్ననే అందరూ షాపింగ్ చేశారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ వర్ష బొల్లమ్మ నటించింది. మిడిల్ క్లాస్ మెలోడిస్ చిత్రంలో ఆనంద్ దేవరకొండతో చేశావు. ఇప్పుడు బెల్లంకొండతో చేస్తున్నావు. మీరు కొండాపూర్‌లో ఉంటారా? లేదా మణికొండలో ఉంటారా? మీకు కొండలలో నెలకొన్న పాట ఇష్టమా అంటూ వర్ష బొల్లమ్మను ఆటపట్టించారు. ఆ తర్వాత జాతిరత్నాలు పాటవేసి ఆమెతో స్టెప్పులు వేశాడు. అంతలోనే సుమ రావడంతో ఆమెను పట్టుకొని నవీన్ పొలిశెట్టి డ్యాన్స్ చేశాడు.

నా డ్రైవర్ నాపై సెటైర్ అంటూ

నా డ్రైవర్ నాపై సెటైర్ అంటూ

సుమతో నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ... తనపై తాను సెటైర్లు వేసుకొన్నాడు. జాతిరత్నాలు తర్వాత మళ్లీ సినిమా రాలేదు. నీవు సినిమా తీస్తున్నావా? చచ్చావా అంటూ మెసేజ్‌లు పెట్టి నన్ను నా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. అలా నాపై అంత ప్రేమగా చూసుకొంటారు. నా డ్రైవర్ లేటుగా రావడంతో నేను అరిచాను. దాంతో నా డ్రైవర్ నాకు కౌంటర్ ఇస్తూ.. వన్ ఇయర్ నుంచి నీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం. మేము ఎప్పుడైనా అరిచామా అని అన్నాడు అని తన సినిమా లేట్ కావడంపై తనపై తాను సెటైర్ వేసుకొన్నారు. కోవిడ్ కారణంగా సినిమాలు లేట్ అయ్యాయి. నాకు ఇష్టమైన అనుష్క శెట్టితో సినిమా చేస్తున్నాను అని అన్నారు.

నాగవంశీ నిజంగా స్వాతిముత్యమే..

నాగవంశీ నిజంగా స్వాతిముత్యమే..

ఇక నాకు ఇష్టమైన వ్యక్తి నిర్మాత నాగవంశీ. నిజంగా స్వాతిముత్యం అంటే.. ఆయనే.. స్వాతిముత్యం టైటిల్‌కు సూటయ్యే వ్యక్తి ఆయనే. మీరు ఒక్కసారి ఆయనతో మాట్లాడితే.. ఎంత మంచి వారో మీకే తెలుస్తుంది. ఆయనతో నేను అనగనగా ఒక రాజు సినిమా చేస్తున్నాను. ప్రేక్షకులకు ఎలాంటి సినిమాను అందించాలని తెలిసిన వ్యక్తి ఆయన. జాతీయ అవార్డు అందుకొన్న నిర్మాత అతను. అతడికి స్వాతిముత్యం సినిమా నుంచి రెండు డైలాగ్స్ డెడికేట్ చేస్తాను అని నవీన్ అన్నారు. లాలీ లాలీ పాటను పేరడి చేసి నవ్వించాడు. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకొన్నాడు. స్వాతిముత్యం చిన్న సినిమా కాదు. దాని స్థాయిని చెప్పేది తెలుగు ప్రేక్షకులే అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X