ప్రభాస్‌‌ను ఇరకాటంలో పడేసిన నవీన్ పోలిశెట్టి.. ఆ రోజే తన పెళ్లి అంటూ..

Naveen Polishetty -Prabhas: యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. నవీన్ పోలిశెట్టి -మీనాక్షి చౌదరి జంటగా నటించిన 'అనగనగా ఒక రాజు' చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను నూతన దర్శకుడు కల్యాణ్ శంకర్ తెరకెక్కించగా, సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో నవీన్ చేసిన సరదా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏమన్నారంటే..?

అనగనగా ఒక రాజు మూవీ ప్రమోషన్స్ ఈవెంట్‌లో తన పెళ్లి గురించి ప్రశ్న ఎదురవ్వగా, నవీన్ పోలిశెట్టి ఫన్నీగా చేసిన కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షించింది. 'ప్రభాస్ అన్నయ్య పెళ్లి చేసుకున్న మరుసటి రోజు 12 గంటలకు నా పెళ్లి ఉంటుంది' అంటూ సరదాగా చెప్పి నవ్వులు పూయించారు. ఈ ఒక్క మాటతో నవీన్ ప్రభాస్‌ను అనుకోకుండా ఇరకాటంలో పడేశాడనే చర్చ మొదలైంది. ప్రభాస్ పెళ్లిపై ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆసక్తి ఉన్న నేపథ్యంలో, నవీన్ వ్యాఖ్యలు అభిమానుల్లో మరింత క్యూరియాసిటీని పెంచాయి.

Naveen Polishetty s Prabhas Wedding Comment Creates Buzz Ahead of Anaganaga Oka Raju promotions

అయితే ఈ వ్యాఖ్య వెనుక సరదా తప్ప మరో ఉద్దేశం లేదని నవీన్ స్పష్టం చేశారు. ప్రభాస్‌తో తనకు ఉన్న స్నేహం చాలా ప్రత్యేకమైందని చెప్పారు. 'మా మధ్య ఎలాంటి పోటీ లేదు. ప్రభాస్ అన్నయ్య నాకు మంచి స్నేహితుడు. ఆయన సినిమాలు వస్తే నేను థియేటర్‌కి వెళ్లి చూస్తాను. ఇప్పుడు అదే హీరోల సినిమాలతో పాటు నా సినిమా విడుదలవుతుండటం చాలా ఆనందంగా ఉంది' అని అన్నారు. ఒకప్పుడు థియేటర్‌కి వెళ్లి అభిమాన హీరోల సినిమాలు చూసిన తాను, ఇప్పుడు అదే స్థాయిలో వారి సరసన నిలబడటం తనకు గర్వకారణమని వెల్లడించారు.

ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు', ప్రభాస్ నటించిన 'ది రాజా సాబ్', నవీన్ పోలిశెట్టి నటించిన 'అనగనగా ఒక రాజు' ఒకే సమయంలో విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒత్తిడి ఉందా అని అడగగా, నవీన్ మాట్లాడుతూ..'చిరంజీవి గారి సినిమా వస్తుంటే ఒత్తిడి ఉండదు. ఆయన సినిమా అంటేనే పండుగ. సగటు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కూడా స్టార్ అవ్వవచ్చని ఇండస్ట్రీకి దారి చూపించిన వ్యక్తి ఆయనే. నాలాంటి వాళ్లందరికీ ఆయన స్ఫూర్తి'అని అన్నారు.

అంతేకాదు, సంక్రాంతి రోజున తన సినిమా చూడటానికి ముందు ఏ సినిమా చూస్తారన్న ప్రశ్నకు నవీన్ ఇచ్చిన సమాధానం కూడా ఆసక్తికరంగా మారింది. 'నేనైతే ఫస్ట్ ప్రభాస్ అన్నయ్య సినిమా చూసి, తర్వాత చిరంజీవి గారి సినిమాకు వెళ్లి... అటునుంచి నా సినిమాకు వెళ్తాను' అంటూ నవ్వుతూ చెప్పారు. ఒక్క రోజులో ఆరు సినిమాలు చూసిన రోజులు కూడా తన జీవితంలో ఉన్నాయని చెప్పడం విశేషం.

ఇక 'అనగనగా ఒక రాజు' సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా తన పాత్ర పూర్తిగా కొత్తగా ఉంటుందని నవీన్ తెలిపారు. గోదావరి యాసతో కూడిన వెటకారమైన పాత్రలో తాను కనిపిస్తానని, ఈ సినిమా చూసిన తర్వాత తన గత పాత్రలు ప్రేక్షకులకు గుర్తుకు రాదని ధీమా వ్యక్తం చేశారు. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'లో క్రైమ్ కామెడీ, 'జాతిరత్నాలు'లో మాస్ ఎంటర్‌టైనర్, 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'లో క్లాస్ ఆడియెన్స్‌కు నచ్చే పాత్రలు చేసిన నవీన్, ఇప్పుడు మరో కొత్త కోణంలో ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమయ్యారు.

అలాగే.. హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి కూడా నవీన్ ప్రశంసలు కురిపించారు. 'సంక్రాంతి అంటే భోగి మంటలు, పతంగులు ఎలా కామన్‌గా ఉంటాయో... ఇప్పుడు మీనాక్షి కూడా అలాగే కామన్ అయిపోయింది. ఈ సినిమాలో చారులత పాత్రకు ఆమె పర్ఫెక్ట్' అంటూ చెప్పారు. ఈ మాటలు ఈవెంట్‌లో నవ్వులు తెప్పించాయి. మొత్తానికి.. 'ప్రభాస్ అన్నయ్య పెళ్లి తర్వాతే నా పెళ్లి' అంటూ నవీన్ పోలిశెట్టి చేసిన సరదా వ్యాఖ్యలు ఒకవైపు నవ్వులు పూయించగా, మరోవైపు ప్రభాస్ అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి. అదే సమయంలో సంక్రాంతి బరిలో నిలిచిన 'అనగనగా ఒక రాజు' సినిమాపై అంచనాలను కూడా పెంచేశాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X