Naresh-Pavitra: ఆమె వచ్చాకే నాన్న అలా మారాడు.. నరేశ్-పవిత్ర బంధంపై కుమారుడు నవీన్ షాకింగ్ కామెంట్స్..
సీనియర్ నటుడు నరేష్ ( Naresh) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సహాయ నటుడిగా బ్యాక్‌టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ మంచి ఫామ్‌లో కొనసాగుతున్నారు. సినిమాల సంగతి పక్కన పెడితే... ఆయన వ్యక్తిగత జీవితం కూడా తరచూ వార్తల్లో నిలుస్తోంది. సీనియర్ నటి పవిత్ర లోకేష్ తో కలిసి జీవిస్తున్న నరేష్, ఈవెంట్లు, పార్టీలకు జంటగానే హాజరవుతూ కనిపిస్తున్నారు.
వీరిద్దరూ మళ్లీ పెళ్లి సినిమాలో భార్యాభర్తలుగా నటించగా, రియల్ లైఫ్‌లోనూ అదే బంధాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నరేష్ కుమారుడు, నటుడు నవీన్ విజయ్ కృష్ణ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. పవిత్ర ఇంట్లో ఎలా ఉంటారు? తండ్రి వ్యక్తిత్వం ఎలా మారింది? అన్న అంశాలపై విజయ్ కృష్ణ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏమన్నారంటే?

పవిత్ర వచ్చాక నాన్న చాలా కామ్ అయ్యారు
నవీన్ విజయ్ కృష్ణ మాట్లాడుతూ... పవిత్ర లోకేష్ చాలా కలుపుగోలుగా ఉంటారని, కుటుంబ సభ్యులతో త్వరగా కలిసిపోతారని చెప్పారు. 'ఆమె నాతో రెగ్యులర్‌గా మాట్లాడుతుంటారు. నిజం చెప్పాలంటే 56 ఏళ్ల వయసులో కూడా నాన్న ఇంత ప్రశాంతంగా కనిపిస్తున్నారంటే దానికి కారణం పవిత్ర గారే. ఆమె ఉన్నప్పుడు నాన్న చాలా కామ్‌గా ఉంటారు. అది నాకు చాలా పాజిటివ్ సిగ్నల్‌లా అనిపిస్తుంది' అని తెలిపారు. పవిత్ర రాకతో ఇంట్లో ఓ మంచి మార్పు కనిపిస్తోందని, తండ్రి సంతోషంగా ఉండటం చూస్తే తనకూ ఆనందంగా ఉంటుందని విజయ్ మనసు విప్పారు.
పవిత్ర లోకేష్‌ను దివంగత సూపర్ స్టార్ కృష్ణ కూడా కలిశారా? ఆయన ఆమోదం ఉందా? అనే ప్రశ్నకు నవీన్ విజయ్ కృష్ణ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. 'అవును.. కృష్ణ గారికీ, నానమ్మ విజయ నిర్మల గారికీ పూర్తి అంగీకారం ఉంది. వాళ్లు ఎప్పుడూ మా నాన్న అభిప్రాయాన్ని కాదనలేదు. ప్రతి విషయంలో సపోర్ట్ చేసేవాళ్లే. వాళ్లు కూడా జీవితంలో ఎన్నో కష్టాలు చూసి వచ్చిన వాళ్లు కాబట్టి, మనిషి లైఫ్‌లో అన్నీ పర్ఫెక్ట్‌గా జరగవని బాగా తెలుసు' అని చెప్పారు.
ఇదే సందర్భంలో ఆయన చాలా ఫిలాసఫికల్‌గా స్పందించారు. 'జీవితంలో అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటామన్నదే ముఖ్యం. ఈరోజు మా నాన్న సంతోషంగా ఉన్నారు... అంతే కదా కావాల్సింది. ఏ పని చేసినా అందరినీ సంతృప్తి పరచలేం. సంతోషాన్ని మనమే వెతుక్కోవాలి. ఆ ప్రయాణంలో కొంతమంది ఫీలింగ్స్ హర్ట్ కావచ్చు' అంటూ నవీన్ వ్యాఖ్యానించారు.
ఇక తండ్రి నరేష్ నుంచి తాను ఏం నేర్చుకుంటున్నానన్న ప్రశ్నకు నవీన్ విజయ్ కృష్ణ మరింత ఆసక్తికరంగా స్పందించారు. 'నాన్న సంతోషాన్ని వెంబడి పరిగెత్తే వ్యక్తి. ఆయనలాగా మనం ఆ స్థాయికి చేరుకోవడం కష్టం. ముఖ్యంగా ఎమోషన్స్‌ను ఆయన మేనేజ్ చేసే విధానం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నేను చాలా ఎమోషనల్ పర్సన్‌ని... కానీ నాన్న అవసరమైనప్పుడు భావోద్వేగాలను పక్కన పెట్టి, చేయాల్సిన పని చేసేస్తారు."
అంతేకాదు, ఫిజికల్‌గా తాను బలంగా ఉండొచ్చేమో కానీ, మెంటల్‌గా నాన్న చాలా స్ట్రాంగ్ అని చెప్పారు. 'వర్క్ వైస్ అయినా, ఎమోషనల్ వైస్ అయినా నాన్న ఒక టాస్క్ మాస్టర్. ఒకేసారి ఎన్నో పనులు చేయగల మల్టీ టాస్కర్'అంటూ తండ్రిపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు.
మరోవైపు నరేష్‌తో కలిసి జీవిస్తున్న సీనియర్ నటి పవిత్ర లోకేష్ గురించి కూడా నవీన్ సానుకూలంగా మాట్లాడారు. పవిత్ర రావడంతో నాన్న మరింత ప్రశాంతంగా మారారని, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగిందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.బయట ఎంత విమర్శలు వచ్చినా, కుటుంబం మాత్రం నరేష్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టు నవీన్ విజయ్ కృష్ణ మాటల్లో స్పష్టంగా ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, మరోసారి నరేష్-పవిత్ర లోకేష్ జంట చర్చనీయంగా మారింది.


Click it and Unblock the Notifications











