టాలీవుడ్‌లోకి నవాజుద్దీన్ సిద్దిఖీ.. కరడు గట్టిన విలన్‌గా ఎంట్రీ!
బాలీవుడ్‌లో వినూత్నమైన పాత్రలు, విలక్షణమైన నటనతో ఆకట్టుకొంటున్న నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నారు. హిట్ ఫ్రాంచైజీలతో వరుస విజయాలు అందుకొన్న దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సైంధవ్ చిత్రం ద్వారా నవాజుద్దీన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. హై ఎలిమెంట్స్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం వెంకటేష్ కెరీర్‌లో 75వ చిత్రం కావడం విశేషంగా చెప్పుకోవచ్చు. సైంధవ్ చిత్రంలో నవాజుద్దీన్ సిద్దిఖీ పాత్ర గురించిన వివరాల్లోకి వెళితే..
శ్యాం సింగరాయ్ లాంటి ఫీల్ గుడ్ సినిమాను అందించిన నిర్మాత వెంకట్ బోయనపల్లి నిర్మాణంలో నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సైంధవ్ సినిమా రూపొందుతున్నది. ఈ చిత్రంలో వికాస్ మాలిక్ అనే పాత్రలో నవాజుద్దీన్ సిద్దిఖీ నటిస్తున్నారు. విలాసవంతమైన కారు బానెట్‌పై కూర్చొని నోటిలో బీడీతో నవాజుద్దీన్ ఇంటెన్సివ్‌గా కనిపించారు. ఈ చిత్రంలో కరడు గట్టిన విలన్ పాత్రలో నటిస్తున్నట్టు ఆయన ఫస్ట్ లుక్ స్పష్టం చేసింది.

సైంధవ్ చిత్రంలో ప్రతిభావంతులైన నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మనోగ్న పాత్రలో శ్రద్దా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నది. అలాగే మరో యువ హీరోయిన్ రుహానీ శర్మ డాక్టర్ రేణు అనే పాత్రలో నటిస్తున్నారు. జాస్మిన్ అనే పాత్రలో తమిళ నటి అండ్రియా జెర్మియా నటిస్తున్నారు. ఇలా ముగ్గురు హీరోయిన్లు ఈ సినిమాలో నటించడం మరో విశేషంగా మారింది.
పాన్ సౌత్ ఇండియా సినిమాగా సైంధవ్ చిత్రం తెరకెక్కుతున్నది. ఈ చిత్రాన్ని కన్నడ, తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.
నటీనటులు: వెంకటేష్, నవాజుద్దీన్ సిద్దిఖీ, శ్రద్దా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా తదితరులు
రచన, దర్శకత్వం: శైలేష్ కొలను
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
మ్యూజిక్: సంతోష్ నారాయణ్
సహ నిర్మాత: కిషోర్ తాళ్లూర్
సినిమాటోగ్రాఫర్: ఎస్ మణికందన్
ఎడిటర్: గ్యారీ బీహెచ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ వెంకటరత్నం
పీఆర్వో: వంశీ శేఖర్
రిలీజ్ డేట్: 2023-12-22


Click it and Unblock the Notifications











