Saindhav: వెంకటేష్ కోసం బాలీవుడ్ అగ్ర నటుడు.. శైలేష్ కొలను సూపర్ స్కెచ్, అదే కీలకంగా!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మొదటిసారిగా పోలీస్ ఆఫీసర్ గా నటించి అదరగొట్టిన హిట్ (HIT: The First Case) మూవీతో డైరెక్టర్ గా మారాడు శైలేష్ కొలను. నిజానికి శైలేష్ కొలను ఒక డాక్టర్. సినిమాలపై ఉన్న ఆసక్తితో డైరెక్టర్ అయ్యారు. చేసింది మొదటి సినిమా అయినా సూపర్ హిట్ కొట్టారు. ఆ తర్వాత హిట్ 2 మరో కేస్ ను డీల్ చేసి మంచి విజయం సాధించారు.

అలాగే నాచురల్ స్టార్ నానితో హిట్ 3 తెరకెక్కించనున్నారు. ఇక ఫ్యామిలీ హీరోగా పేరు సంపాదించుకున్న దగ్గుబాటి విక్టరీ వెంకటేష్ వెంకీ75 సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు 'సైంధవ్' అని టైటిల్ ఫిక్స్ చేసిన వీడియో గ్లింప్ వదిలారు. ఇప్పుడు ఈ సినిమాలో సూపర్ టాలెంటెడ్ యాక్టర్ నటించనున్నట్లు క్రేజీ అప్డేట్ ఇచ్చారు.

హిట్ వర్స్ లో భాగంగా..

హిట్ వర్స్ లో భాగంగా..

2020లో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ "హిట్: ది ఫస్ట్ కేస్" మంచి ప్రేక్షకాదరణ పొందింది. నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా హిందీలో కూడా ఇదే పేరుతో విడుదలైంది. అక్కడ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇటీవల అడవి శేష్ హీరోగా వచ్చిన "హిట్: ది సెకండ్ కేస్" (Hit 2)తో మరో హిట్ అందుకున్నారు డైరెక్టర్ శైలేష్ కొలను. హిట్ వర్స్ లో భాగంగా నానితో హిట్ 3 కూడా తెరకెక్కించనున్నారు.

వెంకటేష్ మాస్ అవతార్..

వెంకటేష్ మాస్ అవతార్..

హిట్ 3 కంటే ముందుగా స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తో సినిమా ప్లాన్ చేశాడు డైరెక్టర్ శైలేష్ కొలను. వెంకటేష్ 75వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు 'సైంధవ్' అని టైటిల్ ఫిక్స్ చేశారు. బుధవారం విడుదల చేసిన ఈ టైటిల్ ఫస్ట్ గ్లింప్ వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ వీడియోలో వెంకటేష్ ను మాస్ అవతారంలో చూసిన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. చాలా కాలం తర్వాత వెంకటేష్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ రోల్ చేయనున్నాడని సంబరపడిపోతున్నారు.

బాలీవుడ్ టాలెంటెడ్ నటుడు..

బాలీవుడ్ టాలెంటెడ్ నటుడు..

ఇక తాజాగా గురువారం ముహుర్తం జరుపుకున్న 'సైంధవ్' సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు దర్శకనిర్మాతలు. ఈ సినిమాలో మోస్ట్ పాపులర్ బాలీవుడ్ యాక్టర్ నటిస్తున్నట్లు అధికారికంగా జనవరి 26న ప్రకటించారు. డైరెక్టర్ శైలేష్ కొలను, విక్టరీ వెంకటేష్ క్రేజీ కాంబినేషన్ లో తెరెకక్కుతున్న 'సైంధవ్' సినిమాలో టాలెంటెడ్ యాక్టర్ నవాజుద్ధీన్ సిద్ధిఖీ నటిస్తున్నట్లు వెల్లడించారు.

వచ్చె నెలలో ప్రారంభం..

నవాజుద్ధీన్ సిద్ధీఖీని 'సైంధవ్' టీమ్ లోకి ఆహ్వానిస్తున్నట్లు ఇంటర్నెట్ లో ఫొటో పంచుకున్నారు. డైరెక్టర్ శైలేష్ కొలను కుర్చీలో కూర్చుని ఉంటే.. వెనుక నవాజుద్ధీన్ నిల్చొని ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఆయన పాత్ర కీలకంగా ఉండనుందని నెటిజన్లు భావిస్తున్నారు. 'సైంధవ్' మూవీ షూటింగ్ ను వచ్చే నెలలో ప్రారంభం కానుందని సమాచారం.

విభిన్న చిత్రాలతో గుర్తింపు..

ఇక నవాజుద్ధీన్ సిద్ధిఖీ విషయానికొస్తే.. సల్మాన్ ఖాన్ బజరంగీ భాయ్ జాన్, అమీర్ ఖాన్ తలాష్, వరుణ్ ధావన్ బద్లాపూర్, లంచ్ బాక్స్, ది గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్ వంటి తదితర చిత్రాల్లో తన నటనతో అదరగొట్టారు. అంతేకాకుండా సైఫ్ అలీ ఖాన్ తో కలిసి నటించిన 'సేక్ర్ డ్ గేమ్స్' వెబ్ సిరీస్ కు దేశవ్యాప్తంగా పేరు లభించింది. ఇక దక్షిణాదిలో సూపర్ స్టార్ రజనీ కాంత్ తమిళ చిత్రం పెట్టాలో నటించారు నవాజుద్ధీన్.

'చంద్రప్రస్త' ఫిక్షనల్ పోర్ట్..

ఇప్పుడు 'సైంధవ్' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు నవాజుద్ధీన్ సిద్ధిఖీ. దీంతో వెంకటేష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, శైలేష్ కొలను కాంబినేషన్ లో వస్తున్న 'సైంధవ్'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నిహారిక ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ గా ఉండనుంది. ఇందులో 'చంద్రప్రస్త' అనే ఫిక్షనల్ పోర్ట్ ఏరియాను క్రియేట్ చేసినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X