‘ఐరా’లో తొలిసారి ద్విపాత్రాభినయంలో నయనతార
నయనతార ప్రధాన పాత్రలో గంగా ఎంటర్‌టైన్మెంట్స్, కేజేఆర్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ఐరా. సర్జున్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార తొలిసారిగా ద్విపాత్రాభినయంలో కనిపించబోతోంది. తెలుగు, తమిళంలో ఒకేసారి మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
భవాని, యమున అనే రెండు పాత్రల్లో నయనతార ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతోంది. హారర్, థ్రిల్లర్లు ఇష్టపడేవారికి మాత్రమే కాదు, భావోద్వేగాలను ఇష్టపడే వారందరికీ ఈ సినిమా నచ్చుతుందని నిర్మాతలు వెల్లడించారు.

దర్శకుడు సర్జున్ మాట్లాడుతూ.. ఇంద్రుడి వాహనం పేరు ఐరావతం. అందులోనుంచే మేం ఐరా అనే పదాన్ని ఎంపిక చేసుకున్నాం. ఐరా అనగానే అందరూ నయనతార పాత్ర పేరని అనుకుంటారు. ఆమె పేరు ఇందులో ఐరా కాదు. కాకపోతే పాత్ర బలాన్ని సూచించడానికి ఐరా అని పేరు పెట్టామని తెలిపారు.
ఇది సూపర్ నేచురల్ థ్రిల్లర్ అయినప్పటికీ, రెగ్యులర్ హారర్ జోనర్లలో కనిపించే వినోదాన్ని మించి ఇంకా ఏదో చేయాలని ప్రయత్నించాం. సినిమా చూసి ఇంటికెళ్లే ప్రేక్షకులు తప్పకుండా ఇందులోని అంశాలను పదిలంగా మోసుకెళ్తారు. సాంకేతికంగానూ ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించాం. సౌండ్ డిజైనింగ్ హైలైట్ అవుతుంది. తొలి సగం ఎంత ఉత్కంఠగా సాగుతుందో, రెండు సగం అంతకు మించి ఉంటుంది. పర్ఫెక్ట్ స్క్రీన్‌ప్లేకి నిదర్శనంలా ఈ సినిమా ఉంటుందని తెలిపారు.
ఈ చిత్రంలో ఇంకా కళైయరసి, యోగిబాబు, మనోబాలా, ఎం.ఎస్.భాస్కర్, వంశీకృష్ణ, ప్రవీణ్ రంగనాథన్, జయప్రకాష్, లీలావతి, కృష్ణ అభిషేక్, రవి ప్రకాష్ తదితరులు నటిస్తున్నారు. కెమెరా: సుదర్శన్ శ్రీనివాసన్,
కూర్పు: కార్తిక్ జోగేష్, స్క్రీన్‌ప్లే: ప్రియాంక రవీంద్రన్, సంగీతం: సుందరమూర్తి. కె.ఎస్.


Click it and Unblock the Notifications











