అప్పుడు సమంత.. ఇప్పుడు నయనతార.. స్టార్ హీరోయిన్స్‌పై డాక్టర్ ఎటాక్!
సౌత్ ఇండియాకి సంబంధించిన స్టార్ హీరోయిన్స్ లో ఇప్పుడు చాలా మంది పాన్ ఇండియా లెవెల్లో కూడా రాణిస్తున్నారు. ఐతే ఈ లిస్ట్ లో తెలుగు, తమిళం సినిమా ఇండస్ట్రీస్ లో బాగా పేరున్న ప్రముఖ హీరోయిన్స్ సమంత అలాగే నయనతారలు కూడా ఒకరు. కాగా ఇప్పుడు ఈ ఇద్దరు టాప్ హీరోయిన్స్ మళ్ళీ తమ కెరీర్ పరంగా బిజీగా మారుతున్నారు. అయితే ఇద్దరూ కూడా పర్శనల్ గా కొన్ని కొన్ని కీలక స్టెప్ లు తీసుకొని సినిమా పలు భారీ ఆఫర్స్ సొంతం చేసుకుంటున్నారు.
అయితే ఇప్పుడు ఈ ఇద్దరు హీరోయిన్స్ విషయంలో ఒక కామన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ కలిసినట్టుగా వినిపిస్తుంది. సమంత గత కొన్నాళ్ల నుంచి మాయోసైటిస్(కండరాల సంబంధిత వ్యాధి) తో బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనితో అందుకు ట్రీట్మెంట్ తీసుకుంటూనే అప్పుడు పలు చిత్రాలు ఆమె చేయగా ఆ తర్వాత సినిమాలు వెబ్ సిరీస్ లకి ఆమె విరామం ఇచ్చి పూర్తి ట్రీట్మెంట్ తీసుకోవడం మొదలు పెట్టింది.

మరి ఈ సమయంలో లవర్ డాక్ అనే ఓ డాక్టర్ సమంతని టార్గెట్ చేసాడు. ఆమె కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ కి హెచ్2ఓ వాటర్ ఆవిరిగా పీల్చడం ఉపశమనాన్ని అందిస్తుంది అని పెట్టిన పోస్ట్ పై సమంత నిరక్షరాస్యురాలు అంటూ కామెంట్స్ చేసాడు దీనితో ఆమె కొన్ని కాంట్రవర్సియల్ పోస్ట్ లు పెట్టింది. ఇక ఇప్పుడు కూడా సరిగ్గా నయనతార విషయంలో కూడా ఇలాగే జరిగింది.
నయనతార ప్రస్తుతం మందారపు టీ అంటూ ఒకటి ప్రమోట్ చేస్తుండగా దీనిపై ఆ సదరు డాక్టర్ అవన్నీ తప్పని నయన్ పై వ్యంగ్యంగా పోస్ట్ లు పెట్టాడట. దీనితో నయన్ కి చిర్రెత్తుకొచ్చి తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని పోస్ట్ స్టోరీస్ పెట్టింది. మూర్ఖులతో వాదించకుండా కామ్ ఉండడమే మంచిది, అసలు నేను చెప్పిన టీ కోసం తెలుసుకోవాలి అనుకునేవారు ఏ మందారంతో ఆ టీ చేస్తారో భేదాలు తెలుసుకోవాలి అంటూ మరికొన్ని స్టోరీస్ పెట్టింది.

దీనితో అదే డాక్టర్ విషయంలో ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ కూడా బాగా హర్ట్ అయ్యారని చెప్పాలి. మరి వారికి తెలిసింది వారు చెప్పి ఉండొచ్చు కానీ డాక్టర్ కంటే ఎక్కువ తెలుసో లేక అతనికి తెలియనిది వారు పోస్ట్ చేసారో కానీ ఇలా ఇద్దరు స్టార్ బ్యూటీస్ విషయంలో ఒకే డాక్టర్ కలుగ జేసుకోవడం అనేది యాదృచ్చికంగా జరిగిందా లేక ఆ సదరు డాక్టర్ కావాలనే టార్గెట్ చేస్తున్నాడా అనేది ప్రశ్నగా మారింది.
కాగా ఇప్పుడు సమంత తెలుగు సహా తమిళ్ హిందీ భాషల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు కూడా చేస్తుండగా నయనతార కూడా తెలుగు సహా తమిళ్ లో పలు సినిమాలు చేస్తుంది. అలాగే హిందీలో కూడా జవాన్ తర్వాత తన రెండో సినిమాగా ఓ భారీ చిత్రాన్ని అది కూడా ఓ యాక్షన్ ఫ్రాంచైజ్ లో ఆమె ఓకే చేసినట్టుగా కూడా పలు రూమర్స్ ప్రస్తుతం ఉన్నాయి.


Click it and Unblock the Notifications











