ధనుష్‌తో కాంట్రవర్సీపై నయనతార ఓపెన్ క్లారిటీ .. ఇంత జరిగినా తగ్గట్లేదుగా

రీసెంట్‌గా సౌత్ ఇండస్ట్రీలో ఓ రేంజ్‌లో హైలైట్ అయిన పలు అంశాల్లో భారీ సినిమాల విడుదలలు మాత్రమే కాకుండా వాటితో పాటుగా పలు క్రేజీ కాంట్రవర్సీలు కూడా స్పెషల్ అటెన్షన్ ని తెచ్చుకున్నాయి . వీటిలో కొన్ని రోజులు అయినా మాంచి ఎంటర్టైన్మెంట్‌ని ఇచ్చిన కాంట్రవర్సీ మాత్రం తమిళ స్టార్ హీరో అండ్ హీరోయిన్లు ధనుష్ , నయనతారల కాంట్రవర్సీ అని చెప్పాలి.

భారీ మొత్తంలో డబ్బులకి తన పెళ్లి డాక్యుమెంటరీ హక్కులను పాపులర్ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్‌కి అమ్ముకున్న సంగతి తెలిసిందే. ఈ డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాణం వహించిన నానుమ్ రౌడీ దాన్ సినిమా తాలూకా విజువల్స్ ఒక మూడు సెకండ్స్ పాటు కనిపించడంతో ధనుష్ లీగల్ గా తన సినిమా కాపీ రైట్ ఇష్యూ రైజ్ చేసి నయన్ కి షాకిచ్చాడు.

nayanthara comments on issue with dhanush finally

అయితే ధనుష్ సైలెంట్ గానే నోటీసులు పంపితే దానిని నయనతార ఓపెన్ గా పెద్ద ప్రెస్ నోట్ రిలీజ్ చేసి బహిర్గతం చేసింది. ఇక అక్కడ నుంచి ఇద్దరి నడుమ మంచి మసాలా స్టార్ట్ అయ్యింది. మొదట నయన్‌కి చాలా మంది సపోర్ట్ చేసినప్పటికీ నెమ్మదిగా ధనుష్‌కి పాజిటివిటీ పెరగడం మొదలైంది. ఇలా ఇద్దరి నడుమ రగడ పెరుగుతూ వెళుతుంది.

మరి ధనుష్ తనకి 10 కోట్లు కట్టాలని నయన్‌ని ఇరికిస్తే నయన్ ఏమో ఇన్ డైరెక్ట్ గా పలు వార్నింగ్స్ కూడా ఇచ్చేది. ఇలా ఈ హైడ్రామా ఇపుడు ఒక రియాలిటీకి వస్తుంది. లేటెస్ట్‌గా నయనతార ఈ కాంట్రవర్సీ‌పై డైరెక్ట్‌గానే ఓపెన్ అయ్యింది. తాను ఏం చెప్తుందంటే.. తాము డాక్యుమెంటరీ సమయంలోనే ఆ సినిమా విజువల్స్ కోసం ధనుష్ ని అప్రోచ్ కావడానికి ట్రై చేసాం అని నయన్ తెలిపారు. తన దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకుందాం అనే అనుకున్నాము కానీ అతను అందుబాటులో లేడు అని చెప్పింది.

nayanthara comments on issue with dhanush finally

అలాగే తాము ఆ సినిమా నుంచి కేవలం నాలుగు లైన్స్ మాత్రమే తీసుకుందాం అనుకున్నాము కానీ అది కూడా కుదరలేదు. అయినా తమ డాక్యుమెంటరీలో చూపించిన విజువల్స్ కూడా అప్పుడు యూనిట్ సభ్యులు సెల్‌ఫోన్ కెమెరాతో చిత్రీకరించినవి మాత్రమేనని నయనతార తెలిపారు. ఇవి కేవలం షూట్ మధ్యలో విజువల్స్ అని.. వాటికి కూడా అభ్యంతరం చెప్పడం తనకు నచ్చలేదు అన్నట్టు వ్యాఖ్యానించింది

ధనుష్ తమకి మంచి ఫ్రెండ్ అయినప్పటికీ ఇలా జరిగిపోయింది అని నయనతార తెలిపారు. అయినా తాను భయపడటం లేదని.. నేను ఏదన్నా తప్పు చేస్తే భయపడాలి తప్ప.. నేను తప్పు చెయ్యలేదు కాబట్టి భయపడను అని ఈ వివాదంపై కీలక కామెంట్స్ చేసింది. దీనితో వీరి కాంట్రవర్సీలో ఫైనల్ గా ధనుష్ పై కామెంట్స్ చేయడం కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఇది పక్కన పెడితే ధనుష్ , నయనతారలు పలు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X