చిరంజీవి సినిమాకు నయనతార ఓకే: ఆ రెండింటిలో ఏ పాత్రకో అంటే నో క్లారిటీ
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే పలు చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఆయన.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి 'ఆచార్య' అనే సినిమాను చేస్తున్నారు. ఇది షూటింగ్ ఇంకా పూర్తి కాక ముందే మరిన్ని ప్రాజెక్టులను ప్రకటించారు. అందులో మలయాళంలో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన 'లూసీఫర్'కు రీమేక్ ఒకటి. పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల ఆలస్యమైంది. తాజాగా దీని గురించి ఓ న్యూస్ లీకైంది.
మోహన్ లాల్ హీరోగా నటించిన 'లూసీఫర్'లో అసలు హీరోయిన్ పాత్రే ఉండదు. అయితే, తెలుగు నేటివిటీకి అనుగుణంగా చిరంజీవి చేసే సినిమాలో ఆ రోల్‌ను యాడ్ చేశాడు దర్శకుడు మోహన్ రాజా. ఇక, ఈ పాత్ర కోసం స్టార్ హీరోయిన్‌ను తీసుకుంటున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. ఇక, తాజాగా ఈ ప్రతిష్టాత్మక సినిమాలో నటించేందుకు లేడీ సూపర్ స్టార్ నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అయితే, ఆమె ఇందులో హీరోయిన్‌గా చేస్తుందా? లేదా? అన్నది మాత్రం ఇంకా స్పష్టం అవడం లేదు.

దీనికి కారణం.. నయనతారకు చిరంజీవి చెల్లెలి పాత్రకు తీసుకున్నారని కొందరు అంటుండగా.. మరికొందరు మాత్రం హీరోయిన్ రోల్ కోసమే ఫిక్స్ చేశారని చెబుతున్నారు. దీంతో ఆమె పాత్రపై అయోమయం నెలకొంది. మొత్తానికి నయన్ ఇందులో నటించేది కన్ఫార్మ్ అయినప్పటికీ.. రోల్‌పై క్లారిటీ రావట్లేదు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాను రామ్ చరణ్, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విలక్షణ హీరో సత్యదేవ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











